రిపబ్లిక్ డే : పద్మ అవార్డ్‌లను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌కు పద్మ భూషణ్

By Siva KodatiFirst Published Jan 25, 2023, 9:04 PM IST
Highlights

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దీనిలో భాగంగా 25 మందికి పద్మశ్రీ  అవార్డులు ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో 91 మందికి పద్మశ్రీ, ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. చిన జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్‌కు పద్మ భూషణ్ అవార్డ్.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని పద్మశ్రీ వరించింది.

ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్‌కి పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బీ రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డ్ ప్రకటించింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లను స్వీకరించింది కేంద్రం. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పారిశ్రామిక తదితర రంగాలలో విశేష సేవలందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. 


పద్మశ్రీ  :

సంకురాత్రి చంద్రశేఖర్
హీరాబాయి లోబి
ముని వెంకటప్ప
రాణి
మునీశ్వర్ చందర్‌వదర్
కపీల్ దేవ్ ప్రసాద్
బీ రామకృష్ణారెడ్డి
రతన్ చంద్ర
వడివేల్ గోపాల్ , మాసి సాడయన్
వీపీ అప్పుకుట్టన్ పొడువల్

 

click me!