ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు..

By SumaBala Bukka  |  First Published Oct 9, 2023, 12:31 PM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. తెలంగాణలో  30 నవంబర్ న ఎన్నికలు నిర్వహించనున్నారు. 


ఢిల్లీ : తెలంగాణ ఎన్నికలు నవంబర్30 న జరగనున్నాయి.  ఒకే విడతలో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 13న స్క్రూటినీ, నవంబర్ 15లోపు నామినేషన్ల విత్ డ్రా జరగున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరగనుంది. 

ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7, 17 న రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ లో నవంబర్ 23, మధ్యప్రదేశ్ నవంబర్ 17,
మిజోరాం నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అన్ని రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న జరగనుంది. 

Latest Videos

undefined

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను  సీఈసీ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలున్నాయి. 40 రోజులపాటు 5 రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించాం అని తెలిపారు. దీనికోసం పార్టీలు ప్రభుత్వ అధికారులతో చర్చించామన్నారు. ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని,  ఐదు రాష్ట్రాల్లో 16. 14 కోట్ల మంది  ఓటర్లు ఉన్నారని తెలిపారు. 

తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే ఈ అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లున్నారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకోసం పోలీస్ స్టేషన్లను, పోలింగ్ బూత్ లను.. బాత్రూంలు, నీటి సౌకర్యం లాంటి కనీస అవసరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 

ఐదు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ 1. 77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్లో 5.06 కోట్ల మంది ఓటర్లు,రాజస్థాన్లో 5.25 కోట్ల మంది ఓటర్లు, చత్తీస్గడ్ లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లున్నారని తెలిపారు. 

 

click me!