స్కూళ్లు తెరిచేలా ఆదేశాలివ్వండి.. సుప్రీంకోర్టులో 12వ తరగతి విద్యార్ది పిటిషన్

By Siva KodatiFirst Published Aug 13, 2021, 5:34 PM IST
Highlights

దేశవ్యాప్తంగా స్కూల్స్ తెరిపించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతున్న విద్యార్ధి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కూళ్లు తెరుచుకోకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతోందని, ఆన్‌లైన్ క్లాసులతో ఆర్ధికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

దేశవ్యాప్తంగా స్కూల్స్ తెరిపించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వేసింది సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతున్న విద్యార్ధి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్కూల్స్ తెరవాలని.. లక్షలాది మంది విద్యార్ధుల తరపున ఈ పిటిషన్ వేస్తున్నట్లు ఆ విద్యార్ధి పేర్కొన్నారు. స్కూళ్లు తెరుచుకోకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతోందని, ఆన్‌లైన్ క్లాసులతో ఆర్ధికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా నిర్ణయం తీసుకునే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్.
 

click me!