దారుణం : నాలుగేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం... చెరువులో పడేసి...

Published : Aug 13, 2021, 04:43 PM IST
దారుణం : నాలుగేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం... చెరువులో పడేసి...

సారాంశం

ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు స్థానిక నరైనా గ్రామ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలిక కోసం​ పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకసాగారు.ఈ క్రమంలో శుక్రవారం బాలిక మృతదేహం ఆమె ఇంటి దగ్గరలోనే ఒక చెరువులో లభించింది.

జైపూర్ : రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది కొంతమంది గుర్తు తెలియని దుండగులు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపూర్ లోని నరైనా గ్రామ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కనపడకుండా పోయింది.

ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు స్థానిక నరైనా గ్రామ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలిక కోసం​ పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకసాగారు.ఈ క్రమంలో శుక్రవారం బాలిక మృతదేహం ఆమె ఇంటి దగ్గరలోనే ఒక చెరువులో లభించింది.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం చేసి చంపినట్లు తెలిపారు.

దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి విగతజీవిగా కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమార్తెను హత్య చేసిన వారిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై స్పందించిన అధికారి ఉమేష్ కుమార్…  నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu