CBSE Class 10 result: సీబీఎస్‌ఈ 10వ తరగతిలో 93.12 శాతం ఉత్తీర్ణత.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

Published : May 12, 2023, 01:47 PM ISTUpdated : May 12, 2023, 01:58 PM IST
CBSE Class 10 result: సీబీఎస్‌ఈ 10వ తరగతిలో  93.12 శాతం ఉత్తీర్ణత.. రిజల్ట్స్  డైరెక్ట్ లింక్ ఇదే..

సారాంశం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల్లో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల్లో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 1.28 శాతం తగ్గింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. ఇక,  1.34 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ విభాగంలో నిలిచారు.

విద్యార్థులు DigiLocker యాప్‌తో పాటు https://cbseresults.nic.in/, https://results.digilocker.gov.in/, https://web.umang.gov.in/landing/ లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాఠశాల నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. (ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

డిజిలాకర్‌లో ఫలితాలను యాక్సెస్ చేయాలంటే..
>తొలుత డిజిలాకర్ వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
>మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఓటీపీని నమోదు చేయడం ద్వారా మీ డిజిలాకర్ ఖాతాలోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
>మీరు లాగిన్ అయిన తర్వాత ‘‘ఎడ్యూకేషన్’’ విభాగంపై క్లిక్ చేసి..  ‘‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’’ ఎంచుకోండి.
>మీ సీబీఎస్‌ఈ అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మీ సీబీఎస్‌ఈ రోల్ నంబర్, స్కూల్ కోడ్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
>అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత.. ‘‘గెట్ డాక్యూమెంట్’’ బటన్‌పై క్లిక్ చేయండి.
>అప్పుడు మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి. మీ రిజల్ట్‌ను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్