మర్డర్ కేసులో డేరా బాబా దోషి.. తేల్చిన సీబీఐ న్యాయస్థానం

By telugu teamFirst Published Oct 8, 2021, 2:56 PM IST
Highlights

ఇప్పటికే లైంగిక వేధింపులు, ఓ జర్నలిస్టు హత్య కేసులో దోషిగా ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా తాజాగా మరో మర్డర్ కేసులోనూ దోషిగా తేలారు. డేరా సచ్చా సౌదాకు మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా సహా మరో నలుగురిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
 

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ dera baba మరో కేసులో దోషిగా తేలారు. ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ఓ మర్డర్ కేసులో దోషి అని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. డేరా సచ్చా సౌదాకు మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ murder కేసులో డేరా బాబా దోషిగా తేలారు. ఆయనతోపాటు మరో నలుగురు నిందితులు జస్బిర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, ఇందర్ సైన్‌లను దోషులుగా పంచకుల cbi special court జడ్జీ సుశీల్ కుమార్ గార్గ్ తేల్చారు. వీరికి ఈ నెల 12న శిక్ష విధించనుంది.

డేరా సచ్చా సౌదాలో మహిళలపై, మహిళా అనుచరులపై డేరా బాబా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నాడని ఓ అనామక లేఖను డేరా మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ ప్రచారం చేస్తున్నారని డేరా బాబా అనుమానించారు. కొన్నాళ్లు గమనించారు. అదే లేఖను హైలైట్ చేస్తూ సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి సంచలన కథనం రాశారు. దీంతో భక్తి ముసుగులో డేరా బాబా చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం, ఆ జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి కూడా హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసులోనూ డేరా బాబా దోషిగా ఉండటం గమనార్హం.

రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. haryana కురుక్షేత్రలోని థానేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఆయన హత్య జరిగింది. ఆ పోలీసు స్టేషన్‌లో మర్డర్, కుట్ర అభియోగాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 2003 నవంబర్ 10న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాను guiltyగా తేల్చింది.

click me!