ఓ సాధారణ గుమాస్తా: ఇల్లంతా బంగారమే, ఎక్కడ చూసినా నోట్ల కట్టలే

By Siva KodatiFirst Published May 30, 2021, 8:38 PM IST
Highlights

ఓ ప్ర‌భుత్వ శాఖలో సాధారణ గుమ‌స్తా జీతం, ఇల్లు, జీవితం ఎలా ఉంటుందో ఇమేజిన్ చేసుకుంటే... సాదాసీదాగానే కనిపిస్తాయన్నది మన అంచనా. కానీ ఓ వ్యక్తి విషయంలో ఈ అంచనా తప్పింది. అతనిపై అనుమానంతో సీబీఐ అధికారులు జ‌రిపిన దాడుల్లో వెలుగుచూసిన డ‌బ్బు, న‌గ‌లు చూసి వారే ఖంగుతిన్నారు.

ఓ ప్ర‌భుత్వ శాఖలో సాధారణ గుమ‌స్తా జీతం, ఇల్లు, జీవితం ఎలా ఉంటుందో ఇమేజిన్ చేసుకుంటే... సాదాసీదాగానే కనిపిస్తాయన్నది మన అంచనా. కానీ ఓ వ్యక్తి విషయంలో ఈ అంచనా తప్పింది. అతనిపై అనుమానంతో సీబీఐ అధికారులు జ‌రిపిన దాడుల్లో వెలుగుచూసిన డ‌బ్బు, న‌గ‌లు చూసి వారే ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్‌‌లో సీబీఐ అధికారులు ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి చెందిన అధికారుల నివాసాల్లో ఏక‌కాలంలో దాడులు జ‌రిపారు. ఈ దాడుల్లో రూ.3 కోట్లకు పైగా న‌గ‌దుతో పాటు క‌రెన్సీ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

గురుగ్రామ్ కు చెందిన కెప్టెన్ కపూర్ అండ్ సన్స్ అనే సెక్యూరిటీ సంస్థ ఈఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నెల‌కు రూ.11.30 ల‌క్ష‌ల‌కు ఎఫ్‌సీఐకు సెక్యూరిటీ గార్డ్ ల‌ను అందించేందుకు టెండ‌ర్ వేసింది. ఆ టెండ‌ర్ కు సంబంధించి నిధులు చెల్లించే విష‌యంలో త‌మ‌కు 10 శాతం క‌మిష‌న్ ఇవ్వాల‌ని ఎఫ్సీఐ అకౌంట్స్ మేనేజ‌ర్ .. ఆ సెక్యూరిటీ కంపెనీని డిమాండ్ చేశాడు. 

Also Read:విశాఖ: ఏసీబీ అదుపులో అవినీతి తిమింగలం

దీంతో కెప్టెన్ క‌పూర్ అండ్ సన్స్ సెక్యూరిటీ యాజ‌మాన్యం సీబీఐ అధికారులకి ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ హరీష్ హినోనియా, మేనేజర్ అరుణ్ శ్రీవాస్తవ,గుమ‌స్తాలు కిషోర్ మీనా,మోహన్ పరాటే ఇళ్ల‌లో దాడులు జ‌రిపారు.ఈ దాడుల్లో గుమ‌స్తా కిషోర్ మీనా ఇంట్లో భ‌య‌ట‌ప‌డ్డ న‌గ‌దు, బంగారంతో చూసి షాక్ తిన్నారు. చెక్క పెట్ట‌ల్లో భ‌ద్ర‌ప‌రిచిన 8 కిలోల బంగారం, రూ. 2.17 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మీనా ఇంట్లో సోదాలు నిర్వ‌హించే కొద్దీ భారీ ఎత్తున న‌గ‌దు బయటపడుతుండటం గమనార్హం. దీంతో సీబీఐ అధికారులు అతనిపై పలు సెక్ష‌న్ల కింద‌ కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే నగలు, నగదు విషయంలో అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో సీబీఐ అధికారులు విచార‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు.  

click me!