మా సభ్యులెవరికీ కరోనా సోకలేదు.. గంగాల్‌ను పోలీసులే చంపారు: మావోయిస్టులు

By Siva KodatiFirst Published May 30, 2021, 6:00 PM IST
Highlights

మావోయిస్టులెవరూ కరోనా బారినపడలేదని మావోయిస్ట్ దక్షిణ సబ్‌ జోనల్ కమిటీ ప్రకటించింది. పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా పేరుతో పోలీసులు అడవిలో కూంబింగ్‌లు చేస్తున్నారని.. కరోనా పేరుతో ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు

మావోయిస్టులెవరూ కరోనా బారినపడలేదని మావోయిస్ట్ దక్షిణ సబ్‌ జోనల్ కమిటీ ప్రకటించింది. పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా పేరుతో పోలీసులు అడవిలో కూంబింగ్‌లు చేస్తున్నారని.. కరోనా పేరుతో ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గంగాల్‌ను పోలీసులే హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు. చికిత్స కోసం బయటకు వస్తే పోలీసులే కిరాతకంగా చంపారని ఆరోపించారు. 

కాగా కొద్దిరోజుల క్రితం దంతేవాడ జిల్లాలో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. ఫుడ్‌ పాయిజన్‌తో కూడా కొంతమంది మావోలు చనిపోయినట్లు సమాచారం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మృతిచెందినవారిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు తెలిసిందన్నారు. బస్తర్‌ రేంజ్‌ పరిధిలో 100 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నారని ఎస్పీ వెల్లడించారు.

Also Read:ఇండియాలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులు, ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏవోబీలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దళాల్లో పలువురికి వైరస్‌ సోకినట్టు నిఘావర్గాలు పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించాయి. ఎటువంటి భయాందోళనలకు తావులేకుండా లొంగిపోతే తగిన వైద్యసేవలు అందిస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, విశాఖ రూరల్‌ పోలీసులు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
 

click me!