
2006-07లో పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించడానికి అప్పటి కేంద్రం ప్రభుత్వం పప్పు దినుసుల ఎగుమతిపై నిషేధం విధించింది. అయినప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల పప్పు దినుసుల ఎగుమతికి సంబంధించిన రూ. 250 కోట్ల కుంభకోణం జరిగిందని సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంలో మొదటిసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఈ కాలంలో ఏజెన్సీ దర్యాప్తు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. దిగుమతులు చేసుకున్న మూడు దేశాలకు పంపబడిన లేఖలకు సకాలంలో ప్రతిస్పందనలు రాకపోవడంతో ఏజెన్సీ పరిశోధన నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మూడు దేశాలకు అభ్యర్థన లేఖలు పంపబడ్డాయి. న్యూజిలాండ్ నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో జెట్ కింగ్, దాని యజమానులు శ్యామ్ సుందర్ జైన్, నరేష్ కుమార్ జైన్, ప్రశాంత్ సేథీలను నిందితులుగా పేర్కొంది. సిబిఐ ప్రకారం.. కుక్ ఐలాండ్స్ బ్యాంక్ జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మార్చడం ద్వారా జెట్ కింగ్ కొన్ని యుఎఇ కంపెనీలతో కలిసి పప్పుదినుసుల ఎగుమతిపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తారుమారు చేసింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలతో పాటు నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీకి సంబంధించిన ఐపిసి సెక్షన్లను సిబిఐ ప్రయోగించింది.
అసలేం జరిగిందంటే.. 2007లో దేశంలో పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించడానికి అప్పటి యుపిఎ ప్రభుత్వం విధించింది. ఆ నిషేధాన్ని తారుమారు చేసి.. బ్యాక్‌డేటెడ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా పప్పులను ఎగుమతి చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.