ఆగని మణిపూర్ మారణహోమం.. మిజోరాంలో 11,000 మందికి పైగా ఆశ్రయం..కేంద్రాన్ని సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం..

Published : Jun 17, 2023, 03:40 AM IST
ఆగని మణిపూర్ మారణహోమం.. మిజోరాంలో 11,000 మందికి పైగా ఆశ్రయం..కేంద్రాన్ని సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం..

సారాంశం

Manipur Violence: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఆందోళనకారులు ఉగ్రవాదుల్లా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు ప్రాణాలు చేతిపట్టుకుని పారిపోతున్నారు. ఇలా శుక్రవారం వరకు మణిపూర్ నుండి మొత్తం 11,503 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారు.

Manipur Violence: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఆందోళనకారులు ఉగ్రవాదుల్లా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. కేంద్ర,రాష్ట్ర మంత్రుల కార్యాలయాలను టార్గెట్ గా చేసుకుని  దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆందోళనకారులు మరోసారి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంఫాల్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గిడ్డంగిని తగలబెట్టారు. ఈ క్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో అల్లరిమూకలు ఘర్షణకు దిగాయి. అల్లరిమూకలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలో అల్లర్లు సంభవించాయని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. హింసాత్మక మణిపూర్ నుండి 11,000 మందికి పైగా నిరాశ్రయులైన ప్రజలు మిజోరాంలో ఆశ్రయం పొందుతున్నారు. వారికి సహాయం చేయడానికి నిధుల విడుదలను వేగవంతం చేయాలని మిజోరాం ప్రభుత్వం శుక్రవారం కేంద్రాన్ని కోరినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. మణిపూర్ లో ఘర్షణలు చెలరేగడంతో ప్రస్తుతం మిజోరంలోని వివిధ ప్రాంతాల్లోని ఆశ్రయాలలో ఉంటున్న వారికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం(మిజోరాం) ₹ 10 కోట్లను కోరింది.  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాబర్ట్ రొమావియా రాయిట్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను పిలిచి,వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని ఆయనను కోరారు. తన వంతుగా, కేంద్రం త్వరలో రిలీఫ్ ప్యాకేజీని మంజూరు చేస్తుందని హోంశాఖ కార్యదర్శి..పర్యాటక శాఖ మంత్రితో చెప్పారు.
 
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో దాదాపు 11,000 మందికి పైగా ప్రజలు ప్రస్తుతం మిజోరంలోని ఆశ్రయాలలో ఉంటున్నారని, ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులే ఉన్నారని తెలిపారు. మిజోరాం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు నిర్వాసితులకు ఆశ్రయాలు, ఆహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంలో మిజోరంకు కేంద్రం సహాయం చాలా అవసరమని పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాబర్ట్ రొమావియా రాయిట్.. నిర్వాసితులకు ప్రతిపాదిత సహాయ నిధిని అందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు.

మిజోరం హోం శాఖ ప్రకారం.. శుక్రవారం వరకు మణిపూర్ నుండి మొత్తం 11,503 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారు. వీరిలో 8,634 మంది సహాయక శిబిరాల వెలుపల నివసిస్తుండగా, 2,869 మంది ప్రభుత్వం, గ్రామాలు ఏర్పాటు చేసిన 35 శిబిరాల్లో మకాం వేసినట్లు తెలిపింది. అందులో కొలాసిబ్ జిల్లాలో అత్యధికంగా 4,109 మంది,  ఐజ్వాల్ 3,825 మంది, సైచువల్ 2,809 మంది ఉన్నారు. కుకీ-హ్మార్-జోమీ-మిజో గ్రూపునకు చెందిన నిర్వాసిత ప్రజలు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఆశ్రయం పొందారు.

 ఇదిలా ఉంటే.. బుధవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఖమెన్‌లోక్ ప్రాంతంలోని హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తొమ్మిది మంది మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక నెల క్రితం రాష్ట్రంలోని మెయిటీ, కుకీ కమ్యూనిటీ ప్రజల మధ్య జరిగిన జాతి హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం 11 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ను నిషేధించారు. 

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించబడిన తర్వాత మొదట మే 3న ఘర్షణలు చెలరేగాయి. 
మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు,కుకీలు( గిరిజనులు) - జనాభాలో మరో 40 శాతం ఉన్నారు.వీరంతా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..