సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

By narsimha lodeFirst Published Jan 10, 2019, 7:38 PM IST
Highlights

సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఉన్న అలోక్ వర్మను తొలగిస్తూ హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకొంది. గురువారం నాడు సుమారు రెండు గంటలకు పైగా సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ కూడ అలోక్‌ వర్మపై వేటు వేసింది.

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఉన్న అలోక్ వర్మను తొలగిస్తూ హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకొంది. గురువారం నాడు సుమారు రెండు గంటలకు పైగా సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ కూడ అలోక్‌ వర్మపై వేటు వేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాడు అలోక్ వర్మ బాధ్యతలను స్వీకరించారు.  సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని హైపవర్ కమిటీ తేల్చింది.  ఈ మేరకు  ఆలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 31వ తేదీతో అలోక్ వర్మ పదవీకాలం ముగియనుంది. నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే వర్మ తన పదవిని కోల్పోయారు. సీవీసీ నివేదికలో వర్మపై వచ్చిన ఆరోపణలను హై పవర్ కమిటీ సీరియస్ గా తీసుకొంది. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ గా తప్పించడాన్ని మల్లిఖార్జున ఖర్గే వ్యతిరేకించారు. వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని జస్టిస్ సిక్రీ కోరారు. 

సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతల నుండి తప్పించిన అలోక్ వర్మను ఫైర్ సర్వీసులకు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

 

click me!