రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న కర్నాటక మాజీ సీఎం...

By Arun Kumar PFirst Published Jan 10, 2019, 6:18 PM IST
Highlights

కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య రోడ్డు ప్రమాదం నుండి తృటితో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్కోకటి ఢీకొట్టుకున్నప్పటికి సిద్దరామయ్య మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్దరామయ్య కాన్వాయ్ లోని ఐదు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా...అందులో ప్రయాణిస్తున్న ఓ ఎస్సై ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. 
 
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాజధాని బెంగళూరు నుండి సిద్దరామయ్య మైసూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని వెనుకనుండి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ముందున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా దాదాపు కాన్వాయ్ లోని ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదానికి గురైన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అయితే ప్రమాదానికి గురైన వాహనాలకు సిద్దరామయ్య ప్రయాణిస్తున్న కారు దూరంగా వుండటంతో ఫెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదం నుండి  సిద్దరామయ్య సురక్షితంగా బయటపడ్డారు. అయితే  ఈ ప్రమాద సమయంలో ఆందోళనకు గురైన సిద్దరామయ్య సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై మారిగౌడ గుండెపోటుతో మృతిచెందాడు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్దరామయ్య ప్రస్తుత జేడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 

click me!