బెంగాల్ మాజీ మంత్రికి మరోసారి షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. రిమాండ్ పొడగింపు

Published : Jan 05, 2023, 10:56 PM IST
బెంగాల్ మాజీ మంత్రికి మరోసారి షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. రిమాండ్ పొడగింపు

సారాంశం

పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టు చేసిన పార్థ ఛటర్జీ జ్యుడీషియల్ కస్టడీని జనవరి 19 వరకు పొడిగించబడింది.

స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టు గురువారం అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో జనవరి 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి కేంద్ర దర్యాప్తు సంస్థను కోరారు.

మాజీ మంత్రి ఛటర్జీ బెయిల్ ను పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత , ఎయిడెడ్ పాఠశాలల్లో అనర్హులకు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇచ్చినందుకు చేతులు మారిన డబ్బును వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, అతను ప్రభావవంతమైన వ్యక్తి అని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు.

ఛటర్జీ తరపు న్యాయవాదులు తనను తప్పుగా ఇరికించారని, తొమ్మిది , పది తరగతులకు ఉపాధ్యాయుల నియామకం కోసం 2016 ప్యానెల్ నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ రోజువారీ పనితీరు గురించి తనకు తెలియదని వాదించారు. ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూలై 23న అరెస్టు చేసింది. అతని సన్నిహిత సహచరురాలు అర్పితా ముఖర్జీ అపార్ట్‌మెంట్లలో భారీ మొత్తంలో నగదు, నగలు మరియు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను సెప్టెంబర్ 16న సీబీఐ కస్టడీలోకి తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయని 2014 నుంచి 2021 మధ్య కాలంలో ఆయన విద్యాశాఖ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. కలకత్తా హైకోర్టు అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది, ఆ తర్వాత స్కామ్‌లో మనీ ట్రయల్‌పై ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. ఈడీ  అరెస్టు చేసిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఛటర్జీని మంత్రి పదవుల నుండి తప్పించింది. అరెస్టు అయినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలు, పరిశ్రమలు , వాణిజ్యంతో సహా అనేక శాఖలను నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జనరల్‌తో సహా పార్టీలో ఆయన నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి కూడా ఆయనను తొలగించింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం