
:
పాట్నా:RJD చీఫ్ Lalu Prasad Yadav కు విదేశాలకు వెళ్లేందుకు అనుగుణంగా పాస్ పోర్టును రిలీజ్ చేసింది CBI కోర్టు.. Kidney ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొనేందుకు సింగపూర్ వెళ్లేందుకు గాను లాలూప్రసాద్ యాదవ్ పాస్ పోర్టును రిలీజ్ చేయాలని కోరారు. గడ్డి స్కాంలో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్ పాస్ పోర్టును సీబీఐ అధికారులు సీజ్ చేశారు.
లాలాూ ప్రసాద్ యాదవ్ తన Pass Port ను రెన్యూవల్ చేసుకొనేందుకు గాను వీలుగా ఈ పాస్ పోర్టును రిలీజ్ చేయాలని కోర్టులో పిటిసన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు పాస్ పోర్టును రిలీజ్ చేసింది. రేపు సాయంత్రంలోపుగా లాలూ ప్రసాద్ యదవ్ పాస్ పోర్టు తమకు అందే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ పాస్ పోర్టును రెన్యూవల్ కోసం పంపుతామని తెలిపారు.
లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. పలు అనారోగ్య సమస్యలతో కూడా ఆయన బాధపడుతున్నాడు. కిడ్నీ, ఊపిరి తిత్తుల సమస్యలతో కూడా లాలూప్రసాద్ యాదవ్ బాధపడుతున్నాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న లాలూప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దొరబండ ట్రెజరీ కేసులో ఆయన బెయిల్ పొందారు. రూ.139 కోట్ల అక్రమాల విషయమై లాలూ ప్రసాద్ కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది
లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ నెల 6న జార్ఖండ్ లోని ప్రత్యేక కోర్టు రూ. 6 వేల జరిమానాను విధించింది. 13 ఏళ్ల నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో లాలూకు కోర్టు ఈ జరిమానాను కట్టాలని ఆదేశించింది. లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెలతో పాటు పలువురి పేర్లతో రైల్వే జాబ్ కోసం భూమి కేసులో సీబీఐ గత నెలలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు అతనికి రూ. 6000 జరిమానా విధించినట్టుగా లాలూ ప్రసాద్ తరపు న్యాయవాది తెలిపారు. 2009 లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయంలో
గర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి RJD అభ్యర్థి గిరినాథ్ సింగ్ కోసం ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ సమయంలో గర్వాలోని గోవింద్ హైస్కూల్‌లో లాలూ సమావేశం జరగాల్సి ఉంది. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు గార్వా బ్లాక్‌లోని కళ్యాణ్‌పూర్‌లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. కానీ నిర్దేశిత హెలిప్యాడ్‌లో దిగకుండాగోవింద్ హైస్కూల్ మైదానంలో సమావేశ స్థలంలో హెలికాప్టర్ దిగింది.
ఈ చర్యను ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అప్పట్లో ఈసీ ఆదేశించింది. లాలూ పక్షాన ప్రజలు హెలికాప్టర్ దారి తప్పిపోయిందని ప్రతిపక్షం మాత్రం జనాన్ని సమీకరించడానికే లాలూ ఇదంతా చేశారన్నారు. అయితే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం లాలూ ప్రసాద్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ, అతడికి కోర్టు రూ.6 వేలు జరిమానా విధించింది.
రైల్వే ఉద్యోగం కోసం భూమి కేసులో లాలూ యాదవ్, అతని భార్య, కుమార్తెలతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంటూ గత నెలలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సీబీఐ. ఢిల్లీ, బీహార్‌లోని లాలూ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 17 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో అతని ప్రయాణంపై ఆంక్షాలు విధించింది.
also read:రాష్ట్రపతి ఎన్నికలు : షాకిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్.. పోటీ చేస్తానంటూ ప్రకటన, కానీ ట్విస్ట్
అయితే.. కిడ్నీ మార్పిడి కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున రెన్యూవల్ కోసం తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని కోరుతూ లాలూ యాదవ్ రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.