
మహమ్మద్‌పై ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున థానే సిటీ పోలీసుల వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని గ్యాంగ్ హ్యాక్ చేసింది. తమ సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమైనందుకు పోలీసులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు. హ్యాకర్లు తాము ఒక ఇస్లామిక్ గ్రూప్ మద్దతుదారులమని ప్రకటించారు.
హ్యాకర్లు వదిలిపెట్టిన సందేశం భారత ప్రభుత్వానికి ఉద్దేశించినదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక తెలిపింది. థానే పోలీసుల వెబ్ సైట్ (www.thanecity.gov.in) ను ఓపెన్ చేయగానే ‘‘ ఒక హ్యాట్ సైబర్ టీమ్ ద్వారా హ్యాక్ చేయబడింది ’’ అని మెసేజ్ అందులో రాసి ఉంది. దీంతో పాటు “ హలో ఇండియన్ గవర్నమెంట్, అందరికీ హలో. ఇస్లామిక్ మతం సమస్యతో మీరు మళ్లీ మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. త్వరగా వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు క్షమాపణలు చెప్పండి !! మా అపొస్తలుడు అవమానానికి గురైనప్పుడు మేము ఊరికే నిలబడి ఉండలేము ’’ అని రాసి ఉంది. అయితే కొంత సమయం తరువాత దానిని టెక్నికల్ టీమ్ సరి చేసింది.
ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా?
థానే పోలీసుల వెబ్‌సైట్ హ్యాకింగ్ వార్త.. నగరవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ హ్యాకింగ్ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జూన్ 10 శుక్రవారం ప్రార్థనల తరువాత భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. జార్ఖండ్ రాజధాని రాంచీ సహా పలు నగరాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలో నిరసనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధఙ నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయాగ్ రాజ్ తో పాటు మరి కొన్ని పట్ణణాల్లో ఆందోళనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి. కాగా దేశంలో నూపుర్ శర్మను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నట్టుగానే.. ఆమెకు మద్దతుగా కూడా ర్యాలీలు తీస్తున్నారు.
Congress: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. : ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫైర్
కాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై అరబ్ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబారులను పిలిపించుకొని వివరణ అడిగాయి. దీంతో వారు వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలు భారతదేశ అభిప్రాయాలు కావని స్పష్టం చేశారు. అనంతరం ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇలాంటి ట్వీట్ చేసిన ఢిల్లీ బీజేపీ మీడియా ప్రతినిధి నవీన్ కుమార్ జిందాలను కూడా సస్పెండ్ చేసింది.