రూ.1.29 కోట్ల లోన్‌ఫ్రాడ్ అభియోగం: రైల్వే శాఖ ఈఈ సహా ముగ్గురిపై కేసు

Published : Nov 01, 2021, 06:19 PM IST
రూ.1.29 కోట్ల లోన్‌ఫ్రాడ్ అభియోగం: రైల్వే శాఖ ఈఈ సహా ముగ్గురిపై కేసు

సారాంశం

దక్షిణ మధ్య రైల్వే ఈఈ ఘన్‌శ్యాం ప్ధాన్  సహా మరో ఇద్దరు కాంట్రాక్టర్లు  ఎం. సూర్యనారాయణ రెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డిలపై  సీబీఐ కేసు నమోదు చేసింది.


హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఈఈ ఘన్‌శ్యాం ప్రధాన్ పై Cbi కేసు నమోదు చేసింది. ఈఈ తో పాటు కాంట్రాక్టర్లపై కూడా కేసులు నమోదయ్యాయి.  ఈకేసులకు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశంలోని 16 చోట్ల సోదాలు నిర్వహించారు.

దక్షిణ మధ్య రైల్వే ఈఈ ఘన్‌శ్యాం ప్రధాన్ సహా కాంట్రాక్టర్లు ఎం. సూర్యనారాయణ రెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డిలపై కూడా కేసులు నమోదు చేశారు. కాంట్రాక్టర్ల నుండి EE సహా మరో ఇద్దరు రూ.1.29 కోట్ల లోన్ ఫ్రాడ్ కి పాల్పడ్డారని సీబీఐ  అభియోగాలు మోపింది.

ఇవాళ 16 ప్రాంతాల్లో సీబీఐ  అధికారులు సోదాలు నిర్వహించారు.  నంద్యాల, బెంగుళూరు,రంగారెడ్డి,హుబ్లీ, సంగ్లీసహా పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.2011 నుండి  2018 వరకు ఈఈ తన కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా వ్యవహరించాడని సీబీఐ ఆరోపించింది.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్