ల్యాండ్ ఫర్ జాబ్స్: మీసా భారతి నివాసానికి సీబీఐ

Published : Mar 07, 2023, 11:52 AM ISTUpdated : Mar 07, 2023, 12:00 PM IST
ల్యాండ్ ఫర్ జాబ్స్:  మీసా భారతి  నివాసానికి సీబీఐ

సారాంశం

ఆర్ జేడీ  లాలూ ప్రసాద్  యాదవ్   కూతురు మీసా భారతి ఇంటికి  సీబీఐ అధికారులు  ఇవాళ  చేరుకున్నారు. ల్యాండ్ ఫర్  జాబ్స్  కేసులో  లాలూను ప్రశ్నించేందుకు  సీబీఐ అధికారులు  మీసా భారతి నివాసానికి చేరుకన్నారు.   


న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్  లాలూ ప్రసాద్  యాదవ్  కూతురు మీసా భారతి  నివాసానికి  మంగళవారం నాడు ఉదయం  సీబీఐ అధికారులు  చేరుకున్నారు. ల్యాండ్  ఫర్ జాబ్స్  కుంభకోణం కేసులో   లాలూ ప్రసాద్ యాదవ్ ను   ప్రశ్నించేందుకు  సీబీఐ అధికారులు మీసా నివాసానికి   వచ్చారు.. ఇదే  కేసు విషయమై  నిన్న  బీహర్ మాజీ సీఎం రబ్రీదేవి  నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన  విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై రబ్రీదేవిని  సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.  


ఈ కేసులో  సీబీఐ అధికారులు  చార్జీషీట్ ను దాఖలు  చేశారు.  మాజీ సీఎం  లాలూ ప్రసాద్  యాదవ్  అతని  కుటుంబ సభ్యులతో పాటు   ఇతరులపై  సీబీఐ అభియోగాలు  మోపింది. ఈ కేసులో  లాలూ ప్రసాద్  యాదవ్  కుటుంబ సభ్యులను  సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి , మీసా భారతిలకు  రౌస్ అవెన్యూ  కోర్టు  సమన్లు జారీ చేసింది. సీబీఐ చార్జీసీట్  నేపథ్యంలో  ఈ నెల  15న  కోర్టుకు  హజరు కావాలని  కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. 

తమను వెయ్యిసార్లు  ఇబ్బంది పెట్టినా తాము  నిలబడుతామని  రబ్రీదేవి చెప్పారు. నిన్న  సీబీఐ అధికారులు  రబ్రీదేవిని  ప్రశ్నించిన  విషయం తెలిసిందే. ల్యాండ్  ఫర్ జాబ్స్  కుంభకోణంలో  లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి,  మీసా భారతితో పాటు మరో  13 మందిపై  సీబీఐ చార్జీషీట్  దాఖలు  చేసింది. ఈ మేరకు  2022 అక్టోబర్ మాసంలో  సీబీఐ చార్జీషీట్  దాఖలు  చేసింది.

2004 నుండి  2009 వరకు  లాలూ ప్రసాద్  యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా  ఉన్న సమయంలో  ఈ కుంభకోణం  జరిగినట్టుగా  ఆరోపణలున్నాయి.  సీబీఐ దాఖలు  చేసిన చార్జీషీట్ లో  లాలూ ప్రసాద్  యాదవ్  తో  సహా  రైల్వే  జనరల్  మేనేజర్  పేరు కూడా ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !