రాజస్తాన్‌లో రెండు గుండెలు, నాలుగు చేతులతో వింత శిశువు జననం.. కానీ 20 నిమిషాల్లోనే..

Published : Mar 07, 2023, 11:14 AM IST
రాజస్తాన్‌లో రెండు గుండెలు, నాలుగు చేతులతో వింత శిశువు జననం.. కానీ 20 నిమిషాల్లోనే..

సారాంశం

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. రతన్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గర్భిణీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు ఉన్న వింత శిశువుకు జన్మనించింది. 

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. రతన్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గర్భిణీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు ఉన్న వింత శిశువుకు జన్మనించింది. అయితే పుట్టిన 20 నిమిషాలలోపే శిశువు మృతిచెందింది. వివరాలు..  రాజల్‌దేసర్ పట్టణానికి చెందిన ఒక మహిళ ప్రసవం కోసం మార్చి 5వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో తన్‌ఘర్‌లోని గంగారామ్ ఆస్పత్రిలో చేరింది. ఆ మహిళకు అక్కడ సాధారణ ప్రసవం జరిగింది. అయితే ఆమె జన్మనిచ్చిన శిశువును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 

ప్రసవం కోసం చేరిన మహిళకు తొలుత సోనోగ్రఫీ నిర్వహించినట్టుగా తెలిపారు. ఆ సమయంలో శిశువు వింతగా కనిపించడం జరిగిందని అన్నారు. ఆస్పత్రిలో చేరిన గంట సేపటి తర్వాత మహిళకు ఆపరేషన్ లేకుండానే సాధారణ డెలివరీ జరిగిందని చెప్పారు. నవజాత శిశువుకు ఒక తల, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు, రెండు వెన్నెముకలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. శిశువు హృదయ స్పందన చాలా తక్కువగా నమోదైందని చెప్పారు. నవజాత శిశువు పుట్టిన సమయంలో శ్వాస పీల్చుకుందని.. అయితే దాదాపు 20 నిమిషాలకే చనిపోయిందని చెప్పారు.

అయితే ప్రసవించిన మహిళా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని  వైద్యులు వెల్లడించారు. ఇక, ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మరింది. ఇందుకు సంబంధించి స్థానికుల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !