కేదార్‌నాథ్‌లో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి.. నెట్టింట వీడియో వైరల్..  నిందితుల కోసం గాలింపు..

Published : Jun 25, 2023, 04:15 AM IST
కేదార్‌నాథ్‌లో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి.. నెట్టింట వీడియో వైరల్..  నిందితుల కోసం గాలింపు..

సారాంశం

కేదార్‌నాథ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్రం నోటిలో బలవంతంగా గంజాయి పెట్టి, ముక్కు, నోటి గుండా పొగ పట్టిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ నడక మార్గంలో గుర్రపు ఆపరేటర్లు మూగ జీవుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. గుర్రానికి  సిగరెట్‌లో డ్రగ్స్ కలిపి బలవంతంగా ముక్కు, నోటి గుండా పొగ పట్టిస్తున్నారు. తాజాగా గుర్రపు నిర్వహకులు జంతువులకు డ్రగ్స్ తో ఉన్న  సిగరెట్లను పట్టిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో వారిపై ఐపిసి, జంతు హింస చట్టం కింద పశుసంవర్ధక ,పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్‌నాథ్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ ధామ్‌కి చేరుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. కేదార్‌నాథ్ ధామ్ ప్రయాణం కష్టతరమైన ప్రయాణంగా పరిగణించబడుతుంది. వాహనాల ద్వారా గౌరీకుండ్‌కు చేరుకున్న తర్వాత.. దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుపైకి వెళ్లేందుకు కాలినడకన లేదా గుర్రాల ద్వారా చేరుకుంటారు. తిరిగి వచ్చే సమయానికి కూడా ఇదే ప్రక్రియ. ఈ తరుణంలో గుర్రాలకు అలసట రాకూడదని వాటి యాజమానులు జంతువుల పట్ల క్రూరత్వంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్బంలో రెండు వేర్వేరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు గుర్రాల నిర్వాహకులు గుర్రం నోటిలో గంజాయి పెట్టారు. ఆ తరువాత వారు దాని నోరు, ముక్కును గట్టిగా మూసారు. వారి వికృత చర్యకు పాపం ఆ మూగజీవి ఉక్కిరిబిక్కిరైంది. కానీ.. ఆ తర్వాత  ఆ గుర్రం గంజాయిని పీల్చటం కనిపించింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చేశారు. ఇలా గుర్రానికి గంజాయి అలవాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీనికి సంబంధించి రుద్రప్రయాగ్ పోలీసులు వైరల్  వీడియోను పరిశీలించారు. ఈ వీడియోలలో ఒకటి కేదార్‌నాథ్ ధామ్ యాత్రలో భీంబాలి పైన ఉన్న ఛోటీ లించోలి వద్ద ఉన్న థారు క్యాంప్ అనే ప్రదేశంలో ఉన్నట్లు కనుగొనబడింది. ఈ విషయంలో కేదార్‌నాథ్ యాత్రను చక్కగా నిర్వహించడం కోసం స్థానిక జిల్లా పరిపాలన స్థాయి నుండి నియమించబడిన సెక్టార్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. సంబంధిత సెక్షన్ల కింద సంబంధిత గుర్రపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయబడింది. IPC, జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అశోక్ పన్వార్ తెలిపారు. గుర్రాల నిర్వహకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్