అఖిలపక్ష సమావేశం ఓ కంటితుడుపు చర్య.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

Published : Jun 25, 2023, 01:54 AM IST
అఖిలపక్ష సమావేశం ఓ కంటితుడుపు చర్య.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

సారాంశం

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన  అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ విరుచుకపడింది. తమ అభిప్రాయాలను తెలియజేయడానికి సమయం ఇవ్వలేదని ఆరోపించింది. కేవలం లాంఛనప్రాయంగానే ఈ సమావేశం జరిగిందని పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ విమర్శించారు.

మణిపూర్ లో చెలారేగుతున్న హింసాకాండపై చర్చించడానికి శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేత్రుత్వంలో  అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశ అనంతరం..కేంద్ర ప్రభుత్వంపై  కాంగ్రెస్ పార్టీ  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ భేటీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. గత 50 రోజులుగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని, వాస్తవానికి  ప్రధాని మోదీనే ఈ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉండాలని విమర్శించారు. 

హోంమంత్రి పిలిచిన ఈ సమావేశాన్ని కేవలం కంటితుడుపు చర్య, లాంఛనమే అని రమేష్ అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, తమ ప్రతినిధి, మణిపూర్ సీనియర్ మోస్ట్ నాయకుడు , 3 సార్లు  సిఎం గా ఎన్నికైన ఒక్రమ్ ఇబోబి సింగ్‌కు మణిపూర్ ప్రజల బాధలు, అక్కడ పరిస్థితులను తెలియజేసే అవకాశం కల్పించలేదని ఆయన ఆరోపించారు.

జైరామ్ రమేష్ తో పాటు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ కూడా మీడియా ముందుకొచ్చి బీజేపీపై విరుచుకుపడ్డారు. జైరామ్ రమేష్ కూడా ఇక్కడ మాట్లాడుతూ, “ఓక్రమ్ ఇబోబి సింగ్ జీకి 3 గంటలలో 7 నిమిషాలు మాత్రమే ఇవ్వడం చాలా విచారకరమని అన్నారు. ఇబోబీ 15 ఏళ్లుగా మణిపూర్ ముఖ్యమంత్రిగా సేవలందించారనీ, ప్రధాన ప్రతిపక్షం తరపున ఆయన సమావేశానికి హాజరయ్యారనీ, ఇది చాలా విచారించదగ్గ ,అవమానకర విషయమని అన్నారు.  

హింసాకాండతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్