ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

Published : Nov 17, 2018, 01:00 PM IST
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

సారాంశం

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. 

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానేలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేలోని షహన్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు నాసిక్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో.. అటువైపుగా వస్తున్న కారు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.

మృతుల్లో 16ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  స్థానిక ఎమ్మెల్యే పాండురంగ బరోరా.. క్షతగాత్రులను పరామర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం