ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి ఆత్మహత్య

Published : Nov 17, 2018, 11:50 AM IST
ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

మూడు రోజులపాటు శిక్షణ పొందేందుకు గురుగ్రామ్ వచ్చిన మౌసమీ గౌతం అతిధి గృహంలో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురుగ్రామ్ నగరంలో చోటుచేసుకుంది. 

అసోం రాష్ట్రంలోని గౌహతి నగరానికి చెందిన మౌసమీ గౌతం (35) ఇండిగో ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది. మూడు రోజులపాటు శిక్షణ పొందేందుకు గురుగ్రామ్ వచ్చిన మౌసమీ గౌతం అతిధి గృహంలో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 తమ సంస్థ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడంపై యాజమాన్యం సంతాపం ప్రకటించింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?