రోడ్డు దాటుతుండగా ప్రమాదం... వ్యక్తి మీద నుంచి 60వాహనాలు...

By telugu news teamFirst Published Feb 20, 2020, 11:19 AM IST
Highlights

కనీసం ప్రమాదానికి గురైన వ్యక్తి ఉన్నాడో,పోయాడో కూడా పట్టించుకోలేదు. అయితే... ప్రమాదానికి గురైన వ్యక్తి అచేత స్థితిలో రోడ్డు పై పడిపోగా... అతని మీద నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60వాహనాలు వెళ్లాయి. అన్ని వాహనాలు అతని మీద నుంచి వెళ్లడంతో.. శరీరం ముక్కలు ముక్కలయ్యింది.

రోడ్డు దాటుతుండగా.. ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఆయన ఉన్నాడో..పోయాడో కూడా ఎవరూ గుర్తించలేదు.  యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కారు ఆపి కనీసం ఏం జరిగిందో కూడా చూడలేదు. ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు. ప్రమాదానికి గురైన వ్యక్తి రోడ్డు మీద అచేతనంగా పడిపోగా... అతని మీద నుంచి దాదాపు 60వాహనాలు వెళ్లాయి. ఈ దారుణ సంఘటన పూణేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి 8గంటల సమయంలో... 47 సంవత్సరాల వయసుగల ఓ వ్యక్తి బావ్రా గ్రామ సమీపంలో .. పూణే-ముంబయి ఎక్స్ ప్రెస్ వే  దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ కారు.. సదరు వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో.. సదరు వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అనిని ఢీకొట్టిన కారు మాత్రం ఎక్కడా ఆగుకుండా వెళ్లిపోయింది.

Also Read ఐదేళ్లు మహిళను రేప్ చేశాడు, చెల్లెను పెళ్లి చేసుకున్నాడు...

కనీసం ప్రమాదానికి గురైన వ్యక్తి ఉన్నాడో,పోయాడో కూడా పట్టించుకోలేదు. అయితే... ప్రమాదానికి గురైన వ్యక్తి అచేత స్థితిలో రోడ్డు పై పడిపోగా... అతని మీద నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60వాహనాలు వెళ్లాయి. అన్ని వాహనాలు అతని మీద నుంచి వెళ్లడంతో.. శరీరం ముక్కలు ముక్కలయ్యింది.

చాలా ఆలస్యంగా అక్కడ ప్రమాదం జరిగిందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు... కొద్దిసేపు ఆ రహదారి వెంట రాకపోకలను నిలిపివేశారు. ఆ తర్వాత చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి షర్ట్ పాకెట్ లో  ఓ డాక్యుమెంట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


సదరు వ్యక్తి బావ్రా గ్రామం అశోక్ నగర్ కి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయితే.. తొలుత అతనిని ఎ కారు ఢీకొట్టిందో మాత్రం తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహం పడి ఉందని పోలీసులు చెప్పారు. దాదాపు 150మీటర్ల వరకు రక్తం దారలై కారిందని చెప్పారు. ఆ రహదారిలో వాహనాలు అతివేగంతో వస్తూ ఉంటాయని.. ఈ ప్రమాదం కూడా అలానే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

click me!