దొంగతనం చేశారనే నెపం... స్క్రూడ్రైవర్లతో చిత్రహింసలు పెట్టి..

Published : Feb 20, 2020, 10:18 AM IST
దొంగతనం చేశారనే నెపం... స్క్రూడ్రైవర్లతో చిత్రహింసలు పెట్టి..

సారాంశం

ఆదివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారూంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. స్క్రూడ్రైవర్ తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం దుస్తులు చింపేసి ఒంటిపై పెట్రోల్ పోశారు.  

దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరు అన్నదమ్ములకు చిత్రహింసలు పెట్టారు. ఒంటిపై దుస్తులు చింపేసి.. వారిపై అతి దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... 

రాజస్థాన్ కి చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు( అన్నదమ్ములు)  నాగౌర్ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారూంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. స్క్రూడ్రైవర్ తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం దుస్తులు చింపేసి ఒంటిపై పెట్రోల్ పోశారు.

Also Read బస్సు డ్రైవర్లకు ఆంక్షలు.. ఆడవారితో మాట్లాడితే ఇక అంతే..

కాగా... వారి బారి నుంచి బయటపడ్డ బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని..  తతంగాన్ని కెమెరాలో రికార్డు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్