సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్నది. ఢిల్లీలో బైకర్‌తో కారు ఢీ కొనడం కలకలం రేపింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఆ కారు డ్రైవర్ తనపై ఆగ్రహించిన బైకర్తోపాట కూడా ఉన్న ఇద్దరిపై కారును ఎక్కించారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇరుకైన గల్లీలో నుంచి వెళ్లుతున్న ఓ కారు.. ఎదురుగా ఉన్న ఓ కారును చిన్నగా తాకింది. ఈ విషయమై కారు డ్రైవర్‌కు బైకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే స్థానికులు అక్కడ గుమిగూడారు. కొందరు ఆ బైకర్ వైపు వచ్చి నిలబడి మద్దతు తెలిపారు. ఆ గొడవను దాదాపు సద్దుమణిగించారు. కానీ, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కారు డ్రైవర్ వాహనంలోకి కూర్చుని ఆ ఇద్దరిపై నుంచి కారును తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ ఘటన ఔటర్ ఢిల్లీలోని అలీపూర్ ఏరియాలోని ఓ ఇరుకైన లేన్‌లో అక్టోబర్ 26న చోటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని అలీపూర్ ఏరియాలో కారు ప్రయాణిస్తుండగా.. ఇరుకైన ఆ గల్లీలో ఎదురుగా ఓ బండి పార్క్ చేసి ఉన్నాడు. వెనుక వైపు వచ్చిన కారు ఆ బండిని చిన్నగా తాకింది. దీంతో ఆ బైకర్ ఆగ్రహించాడు.
| Delhi: A car ran over people in Alipur area on Oct 26 following an argument with a bike rider. 3 people injured & admitted to a hospital. Accused driver, Nitin Maan has been arrested, case registered under sec of IPC incl 307 (attempt to murder). Probe on.
(Source:CCTV) pic.twitter.com/523eyA2v8C
ఈ విషయమై ఆ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కారులో నుంచి డ్రైవర్ బయటికి దిగి మాట్లాడాడు. ఇంతలో స్థానికులు ఆ బైకర్ వైపుకు వెళ్లి అండగా నిలబడ్డారు. స్థానికులు వెంటనే కలుగజేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కానీ, ఆ కారు మెల్లిగా ముందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎదురుగా ఆ బైకర్, ఆయనకు మద్దతుగా నిలిచిన మరో ఇద్దరిని ఆ కారు ఢీకొట్టింది. వారి పై నుంచి కారు వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు వేగంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది.
Also Read: షాకింగ్.. యజమానురాలిని బెదిరించి, యేడాదిగా కారు డ్రైవర్ అత్యాచారం..!
ఈ ఘటన అక్కడే ఉన్న ఓసీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతున్నది. సీసీటీవీల ఫుటేజీ సహాయంగా కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. కారు నెంబర్ చూసి అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.