Punjab Assembly Polls : 22 మందితో తొలి జాబితా ప్రకటించిన అమరీందర్ సింగ్.. పటియాలా నుంచి కెప్టెన్

Siva Kodati |  
Published : Jan 23, 2022, 04:13 PM IST
Punjab Assembly Polls : 22 మందితో తొలి జాబితా ప్రకటించిన అమరీందర్ సింగ్.. పటియాలా నుంచి కెప్టెన్

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. పాటియాలా నియోజకవర్గం నుంచి అమరీందర్ సింగ్ పోటీ చేయనున్నారు. మొత్తం 22 మంది అభ్యర్థుల్లో మఝా ప్రాంతం నుంచి ఇద్దరు అభ్యర్థులను, డొయబ నుంచి ముగ్గురు, మాల్వా ప్రాంతం నుంచి 17 మందిని ఎంపిక చేసినట్టు అమరీందర్ తెలిపారు. రెండో జాబితాను మరి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

మరోవైపు ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ(cm charanjeeth singh channi) పై మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ (amarindar singh) తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సీఎం ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ విమ‌ర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలలో తన ప్రమేయం లేద‌ని సీఎం చన్నీశ‌నివారం స్ప‌ష్టం చేశారు. త‌న‌పై వ‌చ్చిన  ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని వాటిని ఖండించారు. అయితే చ‌న్నీ వ్యాఖ్య‌ల‌న్నీ ‘‘అబ‌ద్దం’’ అని  అమరీందర్ సింగ్ కొట్టిపారేశారు. సీఎంతో పాటుగా రాష్ట్రంలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియాతో వాటాలు ఉన్నాయ‌ని అన్నారు. 

ఈ విష‌యంలో త‌మ‌కు నిర్ధిష్ట స‌మాచారం వ‌చ్చింద‌ని తెలిపారు. ‘‘ నేను (పంజాబ్) సీఎంగా ఉన్నప్పుడే సోనియా గాంధీ (sonia gandhi)కి ఈ విష‌యం తెలిపాను. ఇందులో పై స్తాయి నుంచి కింది స్థాయి వ‌ర‌కు, సీనియ‌ర్ మంత్రుల నుంచి చాలా మంది ప్ర‌మేయం ఉంద‌ని తెలిపాను. ఈ విష‌యంలో ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటావ‌ని సోనియా గాంధీ న‌న్ను అడిగారు. నేను పై నుంచి ప్రారంభించాల‌ని చెప్పాను. కానీ నా మొత్తం ప‌ద‌వీ కాలంలో నేను చేసిన ఒకే ఒక త‌ప్పు ఏంటంటే.. కాంగ్రెస్ ప‌ట్ల నాకు ఉన్న విదేయత వ‌ల్ల నేను వారిపై ఎలాంటి చ‌ర్య తీసుకోలేదు’’ అని అమరీంద్ సింగ్ చెప్పినట్టు మీడియా సంస్థ పేర్కొంది. 

రూప్‌నగర్ (rup nagar) జిల్లాలోని తన నియోజకవర్గం చమ్‌కౌర్ సాహిబ్‌ (chamkour sahib)లో పంజాబ్ సీఎం చన్నీ అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని అకాలీదల్ సీనియర్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా  (bikram singh majithiya)శనివారం ఆరోపించారు. దీనిపై సీబీఐ (cbi)విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే  మజిథియా ఆరోపణపై పంజాబ్ ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. పంజాబ్ అంతటా ఇసుక తవ్వకాలలో తన ప్రమేయాన్ని సూచించే ఒక్క రుజువు అయినా చూపించాలని అతనికి సవాల్ విసిరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !