UP Election 2022 : పీపీఈ కిట్ తో వచ్చి నామినేషన్.. అయినా తిరస్కరణ.. భోరున విలపించిన అభ్యర్థి..

Published : Jan 31, 2022, 08:01 AM IST
UP Election 2022 : పీపీఈ కిట్ తో వచ్చి నామినేషన్.. అయినా తిరస్కరణ.. భోరున విలపించిన అభ్యర్థి..

సారాంశం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ వైద్య రాజ్ కిషన్ అనే వ్యక్తి జనవరి 25వ తేదీన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట శానిటైజర్, థర్మల్ స్కానర్ లను కూడా తెచ్చుకున్నాడు. నామినేషన్ ను పరిశీలించిన అధికారులు మరిన్ని పత్రాలు అవసరమని అతడికి సూచించారు. అయితే, అలా వచ్చిన తనను అధికారులు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్లు అదేరోజు కిషన్ ఆరోపించాడు. చివరకు అధికారులు కోరిన పత్రాలు తెచ్చి ఇవ్వడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు కిషన్ నామినేషన్ను తిరస్కరించినట్లు ఆదివారం వెల్లడించారు.

షాజహాన్పూర్ : Uttar Pradeshలో PPE kitలో వచ్చి Nomination వేసిన ఓ అభ్యర్థి ధరఖాస్తు చివరకు Rejectionకు గురైంది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు... సరైన పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న సదరు అభ్యర్థి అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బోరున విలపించాడు. అంతే కాకుండా ఓ కేంద్ర మంత్రితో అధికారులు కుమ్మక్కై తన నామినేషన్ తిరస్కరించారంటూ ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్లోని Samyukta Vikas Partyకి చెందిన వైద్య రాజ్ కిషన్ కు తాజాగా ఈ సంఘటన ఎదురైంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ Vaidya Raj Kishan అనే వ్యక్తి జనవరి 25వ తేదీన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట శానిటైజర్, థర్మల్ స్కానర్ లను కూడా తెచ్చుకున్నాడు. నామినేషన్ ను పరిశీలించిన అధికారులు మరిన్ని పత్రాలు అవసరమని అతడికి సూచించారు. అయితే, అలా వచ్చిన తనను అధికారులు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్లు అదేరోజు కిషన్ ఆరోపించాడు. చివరకు అధికారులు కోరిన పత్రాలు తెచ్చి ఇవ్వడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు కిషన్ నామినేషన్ను తిరస్కరించినట్లు ఆదివారం వెల్లడించారు. 

దీంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆ వ్యక్తి బోరున విలపించాడు. ఓ కేంద్రమంత్రి సూచనలతోనే అధికారులు తన నామినేషన్ ను తిరస్కరించారని ఆరోపించాడు. అయితే అఫిడవిట్ తో పాటు సరైన పత్రాలు సమర్పించనందువల్లే అతడి నామినేషన్ తిరస్కరణకు గురైందని జిల్లా ఎన్నికల అధికారి దేవేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు.  దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సురేష్ ఖన్నా.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కొట్టేశారు.

ఇదిలా ఉంటే నామినేషన్ వేసిన సంయుక్త  వికాస్ పార్టీకి చెందిన వైద్య రాజ్ కిషన్..  ఇప్పటివరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు.  అన్ని ఎన్నికల్లోనూ ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బరిలో దిగనున్న గోరక్పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు  కిషన్  ఇటీవలే పేర్కొనడం గమనార్హం.

కాగా, యూపీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఎస్‌పీ, బీఎస్‌పీ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  బీజేపీ అధిష్టానంపై విరుచుక‌ుప‌డ్డారు. బీజేపీ నేతలు అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న విమర్శలను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంతే ధీటుగా తిప్పికొట్టారు. 

నేరచరితులకు టిక్కెట్ల విషయంలో బీజేపీ సెంచరీకి చేరువలో ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన 99 మంది అభ్యర్థులను బరిలోకి దింపిందని సమాజ్‌వాదీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘‘బీజేపీకి సెంచరీ కొట్టే అవకాశం తక్కువే. వారు 99 మంది నేరస్థులకు టిక్కెట్లు ఇచ్చారు' అని ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనికి ముందు.. అఖిలేష్ యాదవ్, అతని పార్టీ నేర నేపథ్యం ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తోందని బిజెపి ఆరోపిస్తుండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిలేష్ నిప్పులు చెరిగారు. ఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేరగాళ్ల రాజ్యమే వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌లు మార్లు ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

TVK Party Vijay: టివికె పార్టీ గుర్తు ఆవిష్కరణలో దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu