Cancer cases rising: టీనేజ‌ర్లు.. యువకులలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ! ఎందుకంటే..?

Published : Mar 07, 2022, 11:52 AM IST
Cancer cases rising: టీనేజ‌ర్లు.. యువకులలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు  ! ఎందుకంటే..?

సారాంశం

Cancer cases rising:  దేశంలో క్యాన్స‌ర్ భూతం చాప కింద నీరుల పంజా విసురుతోంది. ముఖ్యంగా టీనేజ‌ర్లు, యువ‌కుల‌లో క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్నాయ‌ని భార‌త వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్య‌య‌నం వెల్ల‌డించింది.   

Cancer cases rising: దేశంలో క్యాన్స‌ర్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మురీ ముఖ్యంగా టీనేజ‌ర్లు, యువ‌కుల‌లో క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్నాయ‌ని భార‌త వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్య‌య‌నం వెల్ల‌డించింది.  హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ (పీబీసీఆర్‌)లో అందుబాటులో ఉన్న డేటాను ఉప‌యోగించుకుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) త‌న అధ్య‌య‌నం కొన‌సాగించింది. ఈ క్ర‌మంలోనే 15 ఏళ్లు మరియు 39 ఏళ్లలోపు యుక్తవయస్కులు మరియు యువకులలో క్యాన్సర్‌లపై ఇటీవలి సమగ్ర ప్రచురణను వెలువ‌రించింది. దీని ప్ర‌కారం..  క్యాన్స‌ర్ బారిన‌ప‌డుతున్న టీనేజ‌ర్లు, 39 ఏండ్ల లోపు వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దీనికి చాలానే కార‌ణాలు ఉన్నాయి. మగవారిలో నోరు, నాలుక మరియు లుకేమియా క్యాన్సర్లు వ‌స్తుండ‌గా, స్త్రీలలో అధికంగా రొమ్ము, థైరాయిడ్ క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ రిపోర్టు పేర్కొంది.

మార్చి 5న సైన్స్‌డైరెక్ట్ జర్నల్‌లో ఎల్సేవియర్ ప్రచురించిన PBCR డేటా నుండి ICMR అధ్యయనం కొన‌సాగిస్తూ.. వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  2025 నాటికి కౌమార మరియు యువ వయోజన విభాగంలోని లింగాల మధ్య క్యాన్సర్ కేసుల సంఖ్య 1,78,617కి పెరుగుతుందని అంచనా వేసింది. 15 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో మగవారి కంటే ఆడవారిలోనే క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. రొమ్ము, థైరాయిడ్, నోరు మరియు నాలుక క్యాన్సర్లు 30 మరియు 39 సంవత్సరాల మధ్య  వారిలో అధికంగా ఉన్నాయ‌ని  పేర్కొంది. అలాగే, రెండు దశాబ్దాలకు పైగా గర్భాశయ క్యాన్సర్  త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని  అధ్యయనం తెలిపింది. 15 నుండి 39 సంవత్సరాల జనాభా సమూహంలో క్యాన్సర్‌ల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ICMR పరిశోధకులు గుర్తించారు. పొగాకు మరియు ఆల్కహాల్ వాడకం, శారీరకంగా చురుకుగా ఉండటం మరియు బరువును నిర్వహించడం వంటి జీవనశైలి ఎంపికలు ఈ వయస్సు వారికి చాలా ముఖ్యమైనవిగా ఉంటాయ‌ని ఐసీఎంఆర్ ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. 

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో భాగంగా, హైదరాబాద్‌కు చెందిన దాదాపు 900 మంది రోగుల క్యాన్సర్ డేటాను పరిశోధకులు విశ్లేషించారు. క్రూడ్ రేటు, అంటే 1,00,000 జనాభాలో క్యాన్సర్ కేసుల సంఖ్య, పురుషులలో హైదరాబాద్‌లో 30, మరియు స్త్రీలలో 33.2 గా ఉంది. అలాగే, హైదరాబాదులో మగవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 124 మందిలో 1 మంది ఉండగా, స్త్రీలలో 110 మందిలో ఒక‌రికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. “కౌమార మరియు యంగ్ అడల్ట్ (AYA) జనాభాలో క్యాన్సర్లు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో AYA ఆంకాలజీ అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నందున, వ్యాధి ఫలితాలు మరియు మనుగడను మెరుగుపరచడానికి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు తగిన AYA క్యాన్సర్ సంరక్షణ విధానాలు మరియు కార్యక్రమాలు చాలా అవసరం”అని భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి అధ్య‌య‌నం పేర్కొంది. 

కాలంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే క్యాన్సర్ బారినపడే అవకాశాలు టీనేజర్లు, యువకులలో పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక ఆవిష్కరణల కారణంగా ముందుగానే వీటిని గుర్తించి.. వైద్యం అందించి.. ప్రాణాలు పోకుండా కాపాడే అవకాశలున్నాయని చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu