యజమానులకోసం కుక్క ప్రాణత్యాగం.. కంటతడి పెట్టిస్తున్న శునకం ‘నిజాయితీ’..

By SumaBala BukkaFirst Published Mar 7, 2022, 11:05 AM IST
Highlights

నిలువెత్తు విశ్వాసానికి ప్రతీక శునకం.. పిడికెడు మెతుకులు వేసినందుకు ప్రాణాలనే ఫణంగా పెడతాయి. అలాంటి ఓ శునకరాజానికి ముంబైలోని ఓ మాల్ యజమానులు అరుదైన గౌరవాన్ని అందించనున్నారు. వివరాల్లోకి వెడితే..

ముంబై :  విశ్వాసానికి, నమ్మకానికి రూపం కుక్క. అందుకే చాలామంది ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు. అయితే వీధికుక్కలూ ఇలాంటి విశ్వాసాన్ని చూపిస్తాయని.. ఓ పిడికెడు మెతుకులు వేస్తే.. తమ జీవితాల్ని ధారపోస్తాయని నిరూపించింది.. ‘బందు’ అనే ఓ శునకం. ఓ మాల్ దగ్గర నివసిస్తున ఈ కుక్క అక్కడి యజమానులకు నమ్మిన బంటులా ఆరేళ్లుగా తోడుండేది. ఎలాంటి ప్రమాదాల్నైనా చిటికెలో గుర్తించి అలర్ట్ చేసేది. అనుకోకుండా ఓ ప్రమాదంలో అది కన్నుమూసింది.. 

ముంబై భాందప్‌ ‘డ్రీమ్స్‌ మాల్‌’ దగ్గర ఓ dog ఆరేళ్ల నుంచి ఉంటుంది. దానికి ఆ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాల ఓనర్లు రోజు అన్నం పెడుతుంటారు. స్థానికులంతా ముద్దుగా ‘బందు’ అని పిలుచుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దానికి ‘బాలు’ అనే మరో కుక్క తోడైంది. ఈ రెండు ఆ mallలో ఉన్న shopలకు కాపలాగా ఉంటాయి. ఎవరైనా దొంగ చూపులు చూసుకుంటూ వెళ్ళినా.. thieftలకు ప్రయత్నించినా..మొరగడంతోపాటు వెంటపడి మరీ పట్టేసుకుంటాయి. మాల్ కు వచ్చే వాళ్ల దొంగతనాలను సైతం ఎన్నోసార్లు అడ్డుకున్నాయి ఈ శునకాలు. అందుకే మళ్ళీ వచ్చినప్పుడు వారు కూడా వాటికి ఏమైనా తిండి పెట్టే వాళ్ళు.

దొంగల్ని గుర్తించడంలో ‘బందు’ ఎంతో స్మార్ట్… అలాగే సెన్సిటివ్ కూడా. కిందటి ఏడాది ఆ మాల్ లో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది వెంటనే గుర్తించి గట్టిగా మొరిగి అందరినీ అప్రమత్తం చేసింది ‘బందు’నే. ఘటన తర్వాత ఈ రెండు కుక్కలు కొద్ది రోజులు దిగులుతో  తినడం సైతం మానేశాయట. శుక్రవారం ఈ మాల్ లో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.  సెక్యూరిటీ గార్డులు సామాన్లను బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే  ‘బందు’ మాత్రం వాళ్లు ఆపదలో ఉన్నారేమో అని పొరవడింది.  

మొరుగుతూ లోపలికి పరుగెత్తింది. ఆ మంటల్లో చాలాసేపు ఉండేసరికి పొగకు ఉక్కిరిబిక్కిరి అయిపోయి స్పృహ కోల్పోయింది. అది గమనించిన సెక్యూరిటీ గార్డులు దాన్ని బయటకు తీసుకువచ్చారు. కాసేపటికి  కోలుకున్నట్లే అనిపించింది.. అయితే… ఊపిరి ఆడక… ఆ మరుసటి ఉదయమే అది మాల్ మెట్లకింద కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. సాధారణంగా మూగ జీవాలు మంటలు చూస్తే దూరంగా పరిగెడతాయి. అలాంటిది బందు మాత్రం కేవలం మనుషుల్ని కాపాడే ఉద్దేశంతోనే వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది..  అందుకే మాల్ దగ్గర బందు స్మారకస్థూపం నిర్మిహిస్తామని ప్రకటించారు యానిమల్ యాక్టివిస్ట్  టాక్టర్ నందిని కులకర్ణి,  

దుకాణాలు ఓనర్లు, సెక్యూరిటీ గార్డుల అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు మాల్‌ దగ్గరే నిర్వహించారు.బందు అంటే  మరాఠిలో నిజాయితీ అని అర్థం, ఆ పేరుకు తగ్గట్టే సార్థక జీవితాన్ని గడిపి.. తుది శ్వాస విడిచింది ఆ మూగ జీవి..  నష్టం జరిగితే జరిగింది కానీ..  బంధు లాంటి విశ్వాసాన్ని,  నిలువెత్తు నిజాయితీని  మళ్ళీ చూడగలమా?  అంటూ బాధ పడుతున్నారు ఆ దుకాణాల ఓనర్లు. పాపం బందు లేకపోయేసరికి బాలు కూడా రెండు రోజులుగా ఏమీ ముట్టడంలేదట. 

click me!