భారత్‌పై ముందు నుంచీ వ్యతిరేకతే.. జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రెసిడెన్షియల్ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో

జీ20 సమావేశాల సందర్భంగా ట్రూడో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. కెనడా ప్రధాని కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. 

canada pm Justin Trudeau Refused 'Presidential Suite' At Hotel During G20: Report ksp

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచిత్ర వైఖరి అంతు చిక్కకుండా వుంది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ వుండొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన పెను దుమారానికి కారణమయ్యారు. దీంతో భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పటికే రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. అయితే జీ20 సమావేశానికి ముందే జస్టిన్ ట్రూడో భారత్‌పై నిందలు మోపాలని చూశారట. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ దినపత్రిక బయటపెట్టింది. కానీ ఆ వ్యూహం ఫలించలేదని ఆ పత్రిక స్పష్టం చేసింది. 

తాజాగా జీ20 సమావేశాల సందర్భంగా ట్రూడో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. కెనడా ప్రధాని కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనిపై అప్పట్లోనే భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఢిల్లీలోని ‘‘ది లలిత్’’ హోటల్‌లో ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేసింది. కానీ ఇందులో బస చేసేందుకు ట్రూడో నిరాకరించారట. దీనికి బదులుగా సాధారణ గదిలో బస చేశారని ఓ అధికారి జాతీయ  మీడియాకు తెలిపారు. 

Latest Videos

ALso Read: ఉగ్రవాదులకు సహకరిస్తున్న 9 వేర్పాటువాద సంస్థలు.. భారత్ చేసిన అభ్యర్థనలను విస్మరించిన కెనడా..

జీ20 సమావేశాలకు హాజరైన దేశాధ్యక్షులు, ప్రధానుల కోసం భద్రతాపరమైన నిబంధనలను అనుసరించి ప్రెసిడెన్షియల్ సూట్‌లను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య షెరటాన్‌లో, చైనా ప్రధాని లీ చియాంగ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. అయితే సదస్సు ముగిసినా జస్టిన్ ట్రూడో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే వున్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత ప్రభుత్వం ట్రూడోకు ఎయిరిండియా వన్‌ను ఆఫర్ చేసింది. కానీ కెనడా ప్రభుత్వం దానిని తిరస్కరించింది. 
 

vuukle one pixel image
click me!