ఎయిర్ ఇండియా నూతన సీఈవో, ఎండీగా కాంప్‌బెల్ విల్సన్? ఈయన ఎవరు?

Published : May 12, 2022, 08:12 PM IST
ఎయిర్ ఇండియా నూతన సీఈవో, ఎండీగా కాంప్‌బెల్ విల్సన్? ఈయన ఎవరు?

సారాంశం

విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నూతన సీఈవో, ఎండీగా కాంప్‌బెల్ విల్సన్‌ను టాటా సన్స్ ఎంపిక చేసింది. కాంప్‌బెల్ విల్సన్ నామినేషన్‌ను ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదించింది. రెగ్యులేటరీ అప్రూవల్స్ రావల్సి ఉన్నాయి. ఈ మేరకు టాటా సన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా నూతన నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్‌గా కాంప్‌బెల్ విల్సన్‌ను నియమించింది. నూతన సీఈవో, ఎండీగా కాంప్‌బెల్ విల్సన్‌కు ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. 50 ఏళ్ల విల్సన్‌కు ఏవియేషన్ ఇండస్ట్రీలో 26 ఏళ్ల విశేష అనుభవం ఉన్నదని టాటా సన్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆయనకు సర్వీస్, తక్కువ కాస్ట్ ఎయిర్‌లైన్స్‌పైనా మంచి అవగాహన ఉన్నదని వివరించింది.

విల్సన్‌కు కీలకమైన గ్లోబల్ మార్కెట్‌లో పని చేసిన అనుభవం ఉన్నదని, అలాగే, అనేక విధాలైన పనులపై పట్టు ఉన్నదని ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా ఖండంలో ఎయిర్‌లైన్ బ్రాండ్ నిర్మించడంలో ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియెన్స్ ఎయిర్ ఇండియాకు కలిసి వస్తుందని వివరించారు.

కాంప్‌బెల్ ఎవరు? 
50 ఏళ్ల కాంప్‌బెల్ విల్సన్‌కు వైమానిక రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉన్నది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌ కోసం ఆయన జపాన్, కెనడా, హాంకాంగ్‌లలో 15 సంవత్సరాలు పని చేశాడు. ఆయన 1996లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌(ఎస్ఐఏ)లో న్యూజిలాండ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించాడు. టాటా అధీనంలోని విస్తారాకు ఈ ఎస్ఐఏ ఒక పార్ట్‌నర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ఎస్ఐఏ కోసం కెనడా, జపాన్, హాంకాంగ్‌లో పని చేశాడు. 2011లో ఆయన సింగపూర్‌కు వచ్చి స్కూట్ విమానయాన సంస్థ సీఈవోగా చేరాడు. 2016 వరకు ఆయన స్కూట్‌కు సారథ్యం వహించారు. అనంతరం మళ్లీ ఎస్ఐఏలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)గా చేశాడు. 2020 ఏప్రిల్‌లో తిరిగి స్కూట్ సీఈవోగా చేరాడు.

న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటర్‌బరీ నుంచి విల్సన్‌ కామర్స్‌లో (ఫస్ట్ క్లాస్ ఆనర్స్) మాస్టర్ పట్టా ఉన్నది.

కాంప్‌బెల్ విల్సన్ కంటే ముందు టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈవో ఐకార్ ఐసీను నూతన ఎయిర్ ఇండియా సీఈవోగా నామినేట్ చేసింది. కానీ, ఆయన ఈ ఆఫర్‌ను మార్చి 1న తిరస్కరించారు.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?