agnipath : 7వ తేదీ నుంచి అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం - BKU నాయకుడు రాకేష్ టికాయత్

By team teluguFirst Published Aug 4, 2022, 1:12 PM IST
Highlights

అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీ నుంచి నిరసనలు తెలుపుతామని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ అన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లో జరిగిన రైతు సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. 

త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం  ఇటీవ‌ల తీసుకొచ్చిన అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయాల‌ని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ టికాయత్ నిర్ణ‌యించారు. దీనిని ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామ‌ని ప్ర‌కటించారు. బుధ‌వారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని తిక్రీ ప్రాంతంలో నిర్వ‌హించిన రైతుల సభను ఉద్దేశించి టికాయ‌త్ మాట్లాడారు. ఈ సమస్యపై కేంద్రంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పోరాటం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు.

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..

‘‘ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం ఆగస్టు 7 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఒక వారం పాటు కొనసాగుతుంది ’’ అని ఆయన అన్నారు.  అనంతరం టికాయ‌త్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులను భయపెట్టేందుకు పాత పోలీసు కేసులను తవ్వేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ సభ్యులపై ఉన్న కేసులు మూసేశారని, అందుకే వారు కేసులకు సిద్ధపడాలని, లేదంటే ఉద్యమానికి సిద్ధమని తికైత్ అన్నారు.

Monkeypox: దేశంలో 9కి చేరిన మంకీపాక్స్ కేసులు.. కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం..!

లక్నో, ఢిల్లీలో ఉన్నవారు దీన్ని జాగ్రత్తగా వినాలని ఆయన అన్నారు. ‘‘ మీరు రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయవచ్చు, మీరు రైతు సంఘాల నాయకులను విడదీయవచ్చు కానీ రైతులను విచ్ఛిన్నం చేయలేరు. రైతులు మీకు (రెండు ప్రభుత్వాలకు) వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు.’’ అని అన్నారు. వందలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించిన రాకేష్ టికాయ‌త్ .. భూసేకరణ, విద్యుత్ టారిఫ్, పెండింగ్‌లో ఉన్న చెరకు బకాయిలకు సంబంధించిన సమస్యలను ఎత్తిచూపారు. వీటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. కాగా... కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న‌ల సంద‌ర్భంగా రాకేష్ టికాయ‌త్ ఒక్క సారిగా వెలుగులోకి వ‌చ్చారు. 
 

click me!