Calcutta University : కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్ల ఆందోళన.. ఎగ్జామ్స్ ఆన్ లైన్ లో నిర్వహించాలని డిమాండ్

By team teluguFirst Published May 22, 2022, 9:40 AM IST
Highlights

వెస్ట్ బెంగాల్ లోని కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్లు పెద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 100 మంది స్టూడెంట్లు ఈ నిరసనలో ఫ్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు. పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కలకత్తా యూనివర్సిటీ నియమించిన ప్యానెల్‌లు సిఫారసు చేసింది. ఈ సిఫార్సుల‌పై అభ్యంత‌రాలు తెలుపుతూ కొంద‌రు స్టూడెంట్లు శుక్రవారం ఆందోళ‌న చేప‌ట్టారు. యూనివర్సిటీ కాలేజ్ స్ట్రీట్ క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. 

భర్తలా నటించి... వదినపై ఆరునెలలుగా మరిది అఘాయిత్యం

దాదాపు 100 మంది విద్యార్థులు తమ డిమాండ్‌లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని అసుతోష్ భవనం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగింది. ‘‘ గత రెండేళ్లలో ఆఫ్‌లైన్ తరగతులు జరగలేదు. ఆన్‌లైన్ తరగతులు మాత్రమే కొనసాగాయి. దీని కారణంగా మా సిలబస్ పూర్తి కాలేదు. అధికారులు మా పేపర్‌లను ఆఫ్‌లైన్‌లో రాయాలని చెబుతున్నారు. ఇలా అయితే మేము పరీక్షలలో ఎలా మంచి స్కోర్ చేయగలం? కనీసం ఈసారి అయినా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాం ’’ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి సౌగత మజుందార్ తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో ఆఫ్‌లైన్ పరీక్షల నిర్వహణ నిర్ణయానికి వ్యతిరేకంగా రవీంద్రభారతి విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం కూడా బీటీ రోడ్ క్యాంపస్‌లో ప్రదర్శన చేసింది, అయితే విశ్వవిద్యాలయ అధికారులు వారి డిమాండ్లకు తలొగ్గలేదు. విద్యార్థులు ప‌రీక్ష‌లు ఆఫ్ లైన్ లోనే రాయాల్సి ఉటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇదే సమయంలో కళ్యాణి విశ్వవిద్యాలయం ఆన్‌లైన్ మోడ్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. క‌రోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.

క‌లక‌త్తా యూనివ‌ర్సిటీలో విద్యార్థులు చేసిన ఆందోళ‌న‌పై తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) రాష్ట్ర అధ్యక్షుడు తృణంకూర్ భట్టాచార్య పీటీఐతో మాట్లాడారు. ‘ఓ వర్గం విద్యార్థులు ప‌రీక్ష‌లు ఆఫ్ లైన్ లో నిర్వ‌హించాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కానీ ఇందులో TMCP ప్రమేయం లేదు. చాలా ఉన్నత విద్యాసంస్థల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రంలో ఎక్కువ శాతం ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించలేదు. కొన్ని 20 శాతం, మరికొన్ని చోట్ల 30 శాతం ఆఫ్‌లైన్ క్లాసులు కొన‌సాగాయి. సంబంధిత సంస్థల అధిపతులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి ’’ అని ఆయ‌న తెలిపారు.  

Amit Shah: నూత‌న విద్యా విధానంపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

కాగా.. అండర్‌గ్రాడ్యుయేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లు, పీజీ ఫ్యాకల్టీ కౌన్సిల్‌ సభ్యులు వేర్వేరుగా అండర్‌గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (పీజీ) స్థాయిల్లో ఆఫ్‌లైన్‌ పరీక్షలకు అనుకూలంగా సిఫార్సు చేశారని సీయూ వైస్‌-ఛాన్సలర్‌ సోనాలి చక్రబర్తి బెనర్జీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల విధానంపై, వారి అభిప్రాయాల కోసం మే 27న అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో మరో సారి సమావేశం నిర్వహించనున్నారు. ఈ అభిప్రాయాలు మరియు సిఫార్సులన్నింటినీ తుది పరిశీలన కోసం జూన్ 3న సిండికేట్ ముందు ఉంచుతామని ఆమె తెలిపారు.
 

click me!