భర్తలా నటించి... వదినపై ఆరునెలలుగా మరిది అఘాయిత్యం

Arun Kumar P   | Asianet News
Published : May 22, 2022, 08:08 AM ISTUpdated : May 22, 2022, 08:15 AM IST
భర్తలా నటించి... వదినపై ఆరునెలలుగా మరిది అఘాయిత్యం

సారాంశం

తల్లిలా చూసుకోవాల్సిన వదినపైనే ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడో దుర్మార్గుడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. 

లాతూర్: వారిద్దరూ కవల సోదరులు. అచ్చం ఒకేలా వుండటమే ఆ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన ఆమె పాలిట శాపంగా మారింది. ఇద్దరు కవలల్లో ఒకరిని పెళ్ళాడిన ఆమెను మరొకడు వంచించాడు. అమ్మలా చూసుకోవాల్సిన వదినపై అఘాయిత్యానికి పాల్పడగా భర్త,అత్తింటివారు ఈ నీచాన్ని సమర్థించారు.  కుటుంబ సంబంధాలకు మచ్చలా నిలిచే ఈ అమానుషం మహారాష్ట్రంలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు కవలలు అచ్చుగుద్దినట్లు ఒకేలా వున్నారు. ఇద్దరికీ పెళ్లివయసు రావడంతో పెద్దవాడికి వివాహం చేసారు. అయితే కొత్తగా పెళ్లిచేసుకుని అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమె భర్త ఎవరో, మరిది ఎవరో గుర్తించలేకపోయేది. ఒకరిని మరొకరిగా భావించి కన్ఫ్యూజ్ అయ్యేది. దీన్ని అదునుగా చేసుకుని ఆమె మరిది దారుణానికి ఒడిగట్టాడు. 

సోదరుడు ఇంట్లో లేని సమయంలో వదినవద్దకు వెళ్లి భర్తలా నటించేవాడు. దీంతో అతడు భర్తగా భావించి ఆమెకూడా ఏం చేసినా అభ్యంతరం తెలిపేది కాదు. ఇలా పలుమార్లు వదినపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆరు నెలల తర్వాత భర్తలా నటిస్తూ మరిది తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఎట్టకేలకు ఆమె గ్రహించగలిగింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తింటివారికి ఈ విషయం తెలిపింది. అయితే ఇదేమీ అంత పెద్ద దారుణం కాదన్నట్లుగా భర్త, అత్తింటివారు చాలా ఈజీగా తీసుకున్నారు. సోదరుడితో సంబంధాన్ని అలాగే కొనసాగించాలని భర్తే ఆమెతో చెప్పడం మరీ విడ్డూరం. 

భర్త, అత్తింటివారు తనపై జరిగిన అఘాయిత్యం గురించి పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు అతడి సోదరుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిపైనా కేసు నమోదు  చేసి అరెస్ట్ చేసారు.

ఇదిలావుంటే ఇటీవల గుంటూరు జిల్లాలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. చెల్లి వరసయ్యే యువతిని పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి లోబర్చుకున్నాడో కామాంధుడు. ఇలా వారు అన్నాచెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరి మధ్య సంబంధం అక్రమం అయ్యే దాకా తీసుకెళ్లాడు. చివరకు అన్నుచేతిలో మోసపోయి ఆ అమాయక చెల్లి ఆత్మహత్య చేసుకుంది.  

గుంటూరు చిలకలూరి పేట తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2019 నుంచి గడ్డిపాడులోని చిన్నమ్మ ఇంటిలో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడే చెల్లి రమాదేవిపై కన్నేశాడు.  
మాయమాటలతో లోబర్చుకుని సోదరి రమాదేవిని శారీరంగా వాడుకున్న జంగా ప్రతాప్ ఆ తర్వాత ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సోదరుడు జంగా ప్రతాప్‌ను రమాదేవి నిలదీసింది. ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రమాదేవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫోన్ మెసేజీలు, కాల్స్ పరిశీలించారు. దీంతో వారి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు జంగా ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారించగా నిజాలను ఒప్పుకున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu