
తమిళనాడు : చిన్న గొడవ చివరికి ప్రాణాల మీదికి తెచ్చింది. OTP చెప్పడంతో ఆలస్యమవ్వడంతో డ్రైవర్ passenger మధ్య చెలరేగిన గొడవ చివరికి అతని ప్రాణాలు పోయేలా చేసింది. సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తానని చెప్పి వచ్చిన Cab driver.. హంతకుడిగా మారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా కాస్త ఓపిక లేకపోవడం, పట్టలేని కోపం, విసుగు, అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడంతో... జరిగిందే. దీంతో రెండు జీవితాలు బలికాగా.. రెండు కుటుంబాలు అనాథగా మారాయి. వివరాల్లోకి వెడితే...
ఓటీపీ విషయంలో చెలరేగిన గొడవ.. తీవ్ర వాగ్వివాదంగా మారడంతో... ఓ క్యాబ్ డ్రైవర్ ప్యాసింజర్ ను చంపిన ఘటన తమిళనాడులో జరిగింది. కోపంతో దారుణానికి ఒడిగట్టిన ఆ డ్రైవర్‌ను కేలంబాక్కం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బాధితుడు ఉమేందర్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, వారం రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఆయన కుటుంబంతో కలిసి గుడువంచెరిలోని బంధువుల ఇంట్లో బస చేశారు. ఆదివారం నవలూరులోని రాజీవ్ గాంధీ సాలైలోని ఓ మాల్‌కు భార్య భవ్య, ఆమె సోదరి కుటుంబంతో కలిసి వెళ్లాడు.
అక్కడినుంచి ఉమేందర్ తమ బంధువుల కుటుంబం ఉండే గుడువాంచెరికి తిరిగి వెళ్లడానికి తిరిగి వెళ్లేందుకు ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ నడుపుతున్న కారును బుక్ చేసుకున్నాడు. కారు రాగానే ఉమేందర్ అందులో ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత క్యాబ్ డ్రైవర్ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను చెప్పమని అడిగారు. దీంతో ఉమేందర్ తన మొబైల్‌లో వెతికాడు. ఈ క్రమంలో నంబర్ షేర్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో కోపానికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఓటీపీ ఇవ్వకుంటే కారు దిగిపోవాలని డ్రైవర్ చెప్పాడు.
హిందూ దేవుళ్ల ఫొటోలున్న పేపర్ పై మాంసం విక్రయం.. వ్యాపారి అరెస్ట్.. ఎక్కడంటే ?
దీంతో ఉమేందర్ కూడా కోపానికి వచ్చి.. కారు దిగిపోయాడు. కారు డోర్ ను గట్టిగా చప్పుడు వచ్చేలా మూశాడు. అతని కుటుంబ సభ్యులు కూడా అతడిని అనుసరించారు. దీంతో డ్రైవర్ అతన్ని మరింత దుర్భాషలాడాడు. ఈ సమయంలో ఉమేందర్ కూల్ డ్రింక్ క్యాన్‌తో డ్రైవర్‌ను కొట్టినట్లు సమాచారం. దీంతో డ్రైవర్ రవి కారు దిగి ఉమేందర్‌ను మొబైల్‌తో కొట్టి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. కిందికి తోసేసి.. కొట్టాడు. ఉమేందర్.. కుటుంబసభ్యులు డ్రైవర్‌ను కూడా చితకబాదారు.
అదే సమయంలో దెబ్బలకు తాళలేక ఉమేందర్ స్పృహ తప్పి పడిపోయాడు. ఉమేందర్‌ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న కేళంబాక్కం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి రవిని అదుపులోకి తీసుకున్నారు. సేలం సెయింట్ థామస్ మౌంట్‌లో ఉంటున్న రవి (41) అనే వ్యక్తిని హత్యానేరం కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.