By-election: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Published : Aug 08, 2023, 07:01 PM IST
By-election: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

సారాంశం

New Delhi: 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజులకే ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

By-election: 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉప ఎన్నికలకు ఆగస్టు 10 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీక‌రించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజులకే ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించే ముందు కాంగ్రెస్ నేతకు సుప్రీం కోర్టు నుంచి ఉపశమనం లభిస్తుందో లేదో వేచి చూడాలని ఈసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

వివ‌రాల్లోకెళ్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీతో సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. త్రిపురలో రెండు స్థానాలకు, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ల‌లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ లోని డుమ్రీ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్నాథ్ మహతో మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్రిపురలోని బాక్స్ నగర్, ధన్ పూర్ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే సంసుల్ హక్ మరణం, ప్రతిమా భూమిక్ రాజీనామాతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు బిష్ణు పాద రాయ్ మరణంతో పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి అసెంబ్లీ స్థానం ఖాళీ కాగా, ఎస్పీకి చెందిన దారా సింగ్ చౌహాన్ బీజేపీలో చేరడానికి రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్ లోని ఘోసి స్థానం ఖాళీ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చందన్ రామ్ దాస్ మరణంతో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ స్థానం ఖాళీ అయింది. కేరళలోని పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి చాందీ ఎమ్మెల్యేగా గెలిచారు. 50 ఏళ్లకు పైగా ఆయ‌న ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఉప ఎన్నికలకు ఆగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు నామినేషన్లు దాఖలు చేయబడతాయి. సెప్టెంబ‌ర్ 5న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక   సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?