బీజేపీ ప్రభుత్వం మహిళలను అవమానించింది.. మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి: సుప్రియా సూలే

Published : Aug 08, 2023, 05:23 PM IST
బీజేపీ ప్రభుత్వం మహిళలను అవమానించింది.. మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి: సుప్రియా సూలే

సారాంశం

New Delhi: బీజేపీ ప్రభుత్వం మహిళలను అవమానించిందనీ, మణిపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్ వెంట‌నే రాజీనామా చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్ సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.   

Nationalist Congress Party (NCP) MP Supriya Sule: మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న నేరాలపై లోక్ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకురాలు సుప్రియా సూలే మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని పార్టీ మహిళలను సిగ్గుపడేలా చేసిందని అన్నారు.  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. "... అల్లర్లు, హత్యలు, అత్యాచారాలకు సంబంధించి 10 వేల కేసులు.. మనం అంత సున్నితంగా తయారయ్యామా? ఇది ఈ ప్రభుత్వంతో ఉన్న‌ సమస్య' అని పార్లమెంట్ దిగువ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎన్సీపీ నేత అన్నారు.

గత తొమ్మిదేళ్లలో అరుణాచల్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ రెండుసార్లు కూలదోసిందన్నారు. గత తొమ్మిదేళ్లలో ధరల పెరుగుదల, ఎల్పీజీ ధరల పెరుగుదల, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను విచ్ఛిన్నం చేయ‌డం చూశామ‌ని విమ‌ర్శించారు. అధికార ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరుగుతుండగా పలువురు ప్రతిపక్ష ఎంపీలు ద్రవ్యోల్బణం, మత సామరస్యాన్ని కాపాడటం, సంస్థల స్వతంత్రతను కాపాడటం సహా పలు అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

గౌరవ్ గొగోయ్ ప్రారంభోపన్యాసం..

అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించారు. "మణిపూర్ హింసపై ప్రధాని మోడీ మౌన వ్రతాన్ని విచ్ఛిన్నం చేయడాని ప్ర‌తిపక్ష కూటమి భారత్‌ను బలవంతంగా తీసుకురావాల్సి వచ్చిందని" అన్నారు. "పార్లమెంటులో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాని మౌన వ్రతం చేశారన్నారు. అందుకే ఆయన మౌనాన్ని వీడేందుకు అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సి వచ్చింది. ఆయనను మూడు ప్రశ్నలు అడుగుతున్నాం..  1). ప్ర‌ధాని ఇప్పటి వరకు మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? 2) చివరకు మణిపూర్ గురించి మాట్లాడటానికి దాదాపు 80 రోజులు పట్టింది, ఆయన మాట్లాడినప్పుడు అది కేవలం 30 సెకన్లు మాత్రమే ఎందుకు?  3). మణిపూర్ సీఎంను ప్రధాని ఇంతవరకు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?