జూన్ 30న కర్ణాటక శాసన మండలిలో మూడు స్థానాలకు ఉపఎన్నిక

By Mahesh KFirst Published Jun 6, 2023, 10:09 PM IST
Highlights

కర్ణాటక శాసన మండలిలో మూడు స్థానాలకు ఈ నెలాఖరున ఉపఎన్నికను ఎలక్షన్ కమిషన్ నిర్వహించనుంది. అదే రోజు అంటే జూన్ 30వ తేదీనే కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు.. తమ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు.
 

బెంగళూరు: కర్ణాటక శాసన మండలిలో మూడు స్థానాలకు ఈ నెలాఖరున ఉపఎన్నిక జరగనుంది. శాసన మండలిలో ఈ నెలలో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందుకే ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీలు సవాడి లక్ష్మణ్ పదవీ కాలం జూన్ 14తో, బాబురావ్ చించాన్సుర్ పదవీ కాలం జూన్ 17తో ముగియనుంది. ఆర్ శంకర్ పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగుస్తున్నది.

ఈ మేరకు ఎన్నికల సంఘం కర్ణాటక శాసన మండలి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు.

జూన్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 20వ తేదీన నామినేషన్‌కు చివరి గడువు అని ఈసీ పేర్కొంది. జూన్ 21న నామినేషన్ల పరిశీలన, జూన్ 23న నామినేషన్ల విరమణకు గడువుగా నిర్ణయించింది. జూన్ 30న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 30వ తేదీనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Also Read: కొత్త పార్లమెంటు నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు: శరద్ పవార్

జూన్ 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అందే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు.

click me!