2024 నాటికి యూపీ రోడ్లను అమెరికాతో స‌మానంగా తీర్చిదిద్దుతాం - సీఎం యోగికి నితిన్ గడ్కరీ హామీ

Published : Oct 09, 2022, 10:02 AM IST
2024 నాటికి యూపీ రోడ్లను అమెరికాతో స‌మానంగా తీర్చిదిద్దుతాం - సీఎం యోగికి నితిన్ గడ్కరీ హామీ

సారాంశం

మరో రెండు సంవత్సరాల్లో అమెరికాలోని రోడ్లతో యూపీ రోడ్లను సమానం చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లక్నోలో జరిగిన ఓ సమావేశంలో ఆయన విషయం వెల్లడించారు. 

2024 సంవ‌త్స‌రం చివరి నాటికి ఉత్తరప్రదేశ్‌ రోడ్లను అమెరికాతో సమానంగా తీర్చిదిద్దుతామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని లక్నోలో జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 81వ వార్షిక స‌మావేశంలో గడ్కరీ వెల్ల‌డించారు. “ 2024 ముగిసేలోపు ఉత్తరప్రదేశ్‌లోని రోడ్డు మౌలిక సదుపాయాలను యూఎస్ఏతో సమానం చేస్తామని నేను (యూపీ సీఎం) యోగి జీకి వాగ్దానం చేశాను. ’’ అని అన్నారు.

మేము ఎక్కువ‌ కండోమ్‌లను ఉపయోగిస్తున్నాం

‘‘ 2024 ముగిసేలోపు ఉత్తరప్రదేశ్‌లో రూ. 5 లక్షల కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులు ఉంటాయని నేను హామీ ఇచ్చాను. ఈరోజు రూ. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాను. ’’ అని నితిన్ గడ్కరీ అన్నారు. మంచి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బుకు కొరత లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, విదేశాలకు చెందిన ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్, రోడ్డు రంగ నిపుణులు కలిసి పనిచేయడానికి ఈ మూడు రోజుల ఐఆర్సీ సమావేశం ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు. 

కాగా.. ఈ సమావేశంపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, ఆవిష్కరణ, భద్రత, నాణ్యతతో దేశంలో వేగవంతమైన సమగ్ర, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించాలని రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెనుక ఉన్న భాగస్వాములు విశ్వకర్మలందరినీ గడ్కరీ కోరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి.. గుజ‌రాత్ లో తీవ్ర ఉద్రిక్త‌త‌.. దుకాణాల‌కు నిప్పు, ఫైర్ ఇంజ‌న్ ధ్వంసం

ఈ స‌మావేశం అనంత‌రం గ‌డ్క‌రీ లక్నోలోని ముఖ్యమంత్రి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న, ప్రతిపాదిత జాతీయ రహదారి ప్రాజెక్టులన్నింటినీ సమావేశంలో వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu