అన్న అప్పు తీర్చలేదని...చెల్లెలిపై అఘాయిత్యం

Published : Mar 06, 2019, 09:50 AM IST
అన్న అప్పు తీర్చలేదని...చెల్లెలిపై అఘాయిత్యం

సారాంశం

అన్న తీసుకున్న అప్పు చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి చెల్లెలిపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

అన్న తీసుకున్న అప్పు చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి చెల్లెలిపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కాగా.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన తారకనాథ్‌ చాలా ఏళ్ల క్రితం భార్యతో కలసి బెంగళూరు నగరానికి వచ్చి హుళిమావులో స్థిరపడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన తారకనాథ్‌ నష్టపోయాడు. దీంతో.. స్థానిక వడ్డీ వ్యాపారి బాలాజీ వద్ద రూ.6లక్షలు అప్పుతీసుకున్నాడు. వాటితో మళ్లీ పెట్టుబడి పెట్టినా.. నష్టాలు తప్పలేదు. దీంతో.. అప్పు చెల్లించలేకపోయాడు. 

 దీంతో అప్పు చెల్లించాలంటూ బాలాజీ తరచూ తారకనాథ్‌ ఇంటికి వచ్చి బెదిరించేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తారకనాథ్‌ చెల్లెలు ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చి అన్న తారకనాథ్‌ ఇంట్లోనే ఉంటున్నారు. అప్పు చెల్లించాలంటూ తరచూ ఇంటికి వస్తున్న బాలాజీ తారకనాథ్‌ చెల్లిలిని చూసి ఆమెను లొంగదీసుకోవడానికి కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ప్రతీరోజూ తారకనాథ్‌ ఇంటికి రావడం మొదలుపెట్టిన బాలాజీ అప్పు చెల్లించాలంటూ తారకనాథ్‌ చెల్లిలిని లైంగికంగా వేధించసాగాడు. 

బెదిరిస్తూ పలుమార్లు అకృత్యాలకు పాల్పడ్డాడు. బాధితురాలు రెండేళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న బాలాజీ మరింత రెచ్చిపోయాడు. వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu