కొడుకు చూస్తుండగా భార్య కొట్టిందని.. భర్త ఆత్మహత్య

Published : Mar 05, 2019, 02:53 PM IST
కొడుకు చూస్తుండగా భార్య కొట్టిందని.. భర్త ఆత్మహత్య

సారాంశం

కన్న కొడుకు చూస్తుండగా.. భార్య తనను కొట్టడానికి ఓ భర్త జీర్ణించుకోలేకపోయాడు.


కన్న కొడుకు చూస్తుండగా.. భార్య తనను కొట్టడానికి ఓ భర్త జీర్ణించుకోలేకపోయాడు. కనీసం కన్న కొడుకు వద్ద కూడా తన పరువు కాపాడుకోలేకపోయాననే  బాధతో అతను ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. ఈ దారుణ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం దాసరహళ్లి ప్రాంతానికి చెందిన దొడ్డయ్య(45).. కోకోనట్ గార్డెన్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. అతనికి పదేళ్ల క్రితం వివాహమై ఒక కొడుకు కూడా ఉన్నాడు.

అయితే.. ఇటీవలయ కుటుంబ కలహాల నేపథ్యంలో.. భార్య దొడ్డయ్యను కొట్టింది. ఆ సమయంలో వారి కొడుకు అక్కడే ఉన్నాడు. దీంతో.. అవమానంగా భావించిన దొడ్డయ్య.. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!