అదుపుతప్పి లోయ‌లో ప‌డ్డ 50 మంది ప్రయాణికుల బ‌స్సు..

Published : Apr 08, 2023, 12:54 PM IST
అదుపుతప్పి లోయ‌లో ప‌డ్డ 50 మంది ప్రయాణికుల బ‌స్సు..

సారాంశం

Pune 50 road accident: మంది ప్రయాణికులతో తుల్జాపూర్ నుంచి వెళ్తున్న ఒక ప్ర‌యివేటు బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి ఒక లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  

Road Accident: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. జిల్లాలోని బారామతి తాలూకాలోని మలాడ్ గ్రామ సమీపంలో ఉదయం 5:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని దౌండ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. 50 మంది ప్రయాణికులతో తుల్జాపూర్ నుంచి వెళ్తున్న ఒక ప్ర‌యివేటు బస్సు డ్రైవర్ అదుపు తప్పి రోడ్డుపై నుంచి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.

గాయపడిన 16 మందిని పిరమిడ్ ట్రామా సెంటర్లో, మిగిలిన ఆరుగురిని భిగ్వాన్ ఐసీయూ ఆస్పత్రిలో చేర్పించారు. కొల్హాపూర్, పండరీపూర్ తదితర తీర్థయాత్రల కోసం ఈ బస్సును అద్దెకు తీసుకున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇక్కడి భవానీ పేట వాసులేనని పోలీసులు తెలిపారు. 

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 

ఉత్తర్ ప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో  ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది.  శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. అంతకుముందు బలరాంపూర్ లో బస్సు బోల్తా పడటంతో 17 మంది గాయపడగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

జిల్లాలోని శ్రీదత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాంపూర్-ఉత్రౌలా రహదారిలోని గాలిబ్ పూర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం వేగంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారు గుర్తుతెలియని ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు చక్రాలు ఎగిరిపోవడంతో కారు డ్రైవర్ స‌హా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. శనివారం వేకువజామున 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయం పోలీసులు, స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి కారు లోపల నుంచి మృతదేహాలను వెలికితీశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు