ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్.. బ్రిడ్జీని ఢీకొన్న బస్సు.. ఛత్తీస్‌గడ్‌లో 26 మందికి గాయాలు

Published : Jun 19, 2023, 12:59 PM IST
ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్.. బ్రిడ్జీని ఢీకొన్న బస్సు.. ఛత్తీస్‌గడ్‌లో 26 మందికి గాయాలు

సారాంశం

ఛత్తీస్‌గడ్‌లో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా బస్సు బ్రిడ్జీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.  

Accident: ఛత్తీస్‌గడ్‌లో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పదుల సంఖ్యలో ప్రయాణికులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఫోన్ మాట్లాడుతూనే డ్రైవర్ బస్సు నడిపాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి బ్రిడ్జీని ఢీకొంది. దీంతో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడని, అందువల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన రాయిగడ్ జిల్లాలో ఘార్‌గోడా సమీపంలోని బ్రిడ్జీ వద్ద ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆ బస్సు రైలు బ్రిడ్జీపైన ప్రమాదానికి గురైంది.

Also Read: విపక్షాల ఐక్యత కార్యరూపం దాల్చేనా?.. ఆ పార్టీలకు రాష్ట్రాలనే వదిలిపెట్టాలా?.. డైలామాలో కాంగ్రెస్!

మొత్తం 26 మంది గాయాలపాలయ్యారని ఎస్‌డీవోపీ దీపక్ మిశ్రా తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వివరించారు. వారిని రాయ్‌గడ్ మెడికల్ కాలేజీలో చేర్చినట్టు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?