ఇక వారానికి నాలుగు రోజులే పని

By ramya neerukondaFirst Published Dec 24, 2018, 4:44 PM IST
Highlights

త్వరలో వారానికి 4 రోజల పనిదినాలు రాబోతున్నాయి. జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం ఇవ్వనున్నారు.

ఒక్క రోజు సెలవు కోసం.. వారమంతా ఎదురుచూస్తూ ఉద్యోగాలు చేసేవారు కోకొల్లలు. కేవలం ఐటీ ఉద్యోగులకు మాత్రమే వారానికి రెండు రోజులు విశ్రాంతి లభిస్తుంది. మిగిలినవారంతా ఆరు రోజులు పనిచేయాల్సిందే. అయితే.. త్వరలో వారానికి 4 రోజల పనిదినాలు రాబోతున్నాయి. 

జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కంపెనీలు ఇది బాగానే పనిచేస్తున్నదని అంటున్నాయి. అమెరికా, బ్రిటన్‌తో సహా 8 దేశాల్లోని 3 వేలమంది ఉద్యోగులపై ఈ జరిపిన అధ్యయనంలో నేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

 దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని, సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుందని, అలసట తగ్గిపోతుందని పరిశీలనలో తేలిందని చెప్తున్నాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని ప్లేనియో కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ షుల్జ్-హాఫెన్ తెలిపారు. ఆయన తన కంపెనీలో 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. 

వారానికి కేవలం నాలుగు రోజులు పనిదినాలు కావడంతో.. ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారట. ఎలాంటి ఒత్తిడి వారిలో కనిపించడం లేదని పర్పెచువల్ గార్డియన్ అనే న్యూజీల్యాండ్ కంపెనీ తెలిపింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పనిచేసి.. ఎక్కువ ఫలితాన్ని చూపిస్తున్నారని సర్వేలో తేలింది. మరి ఈ విధానం మనదేశానికి ఎప్పుడు వస్తుందో చూడాలి. 
 

click me!