ఫ్రెండ్‌షిప్‌తో ఇంటికొస్తే...భార్య స్నేహితురాలిని తల్లిని చేశాడు

sivanagaprasad kodati |  
Published : Dec 24, 2018, 02:09 PM IST
ఫ్రెండ్‌షిప్‌తో ఇంటికొస్తే...భార్య స్నేహితురాలిని తల్లిని చేశాడు

సారాంశం

ఫ్రెండ్‌షిప్ కొద్ది స్నేహితురాలిని కలిసేందుకు రావడమే ఆమె పాలిట శాపమైంది. దీనిని అవకాశంగా తీసుకున్న స్నేహితురాలి భర్త ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడు.

ఫ్రెండ్‌షిప్ కొద్ది స్నేహితురాలిని కలిసేందుకు రావడమే ఆమె పాలిట శాపమైంది. దీనిని అవకాశంగా తీసుకున్న స్నేహితురాలి భర్త ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్‌కు సమీపంలోని కిలికోడి గ్రామానికి చెందిన షర్మిల అనే యువతితో మూడేళ్ల కిందట పెళ్లయ్యింది..

ఈ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత సిలంబరసన్ భార్యాబిడ్డలతో కలిసి కిలికోడి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలు ఒకరు తరచూ ఇంటికి వచ్చి సరదాగా కబుర్లు చెప్పి వెళ్లేది.

ఆమెపై కన్నేసిన సిలంబరసన్ భార్య లేని సమయంలో ఒక రోజు ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలితో మాట కలిపాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు..

ఈ తతంగాన్ని వీడియో ఎవరికైనా చెబితే ఈ దృశ్యాలను నెట్‌లో పెడతానని బెదిరించి లోబరుచుకుని పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు గత నెల 21న పొన్నేరిలోని ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది.

ఈ క్రమంలో తన బిడ్డకు తండ్రి సిలంబరసనే అని..తనను బెదిరించి తల్లిని చేశాడంటూ బాధితురాలు గుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిలంబరసన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu