దోపిడీలు చేస్తూ..ఆరుగురు భార్యలతో విలాసవంతమైన జీవితం.. భార్యల్లో ఒకరు సినీనటి

By sivanagaprasad KodatiFirst Published 12, Sep 2018, 12:59 PM IST
Highlights

తమిళనాడులో ఇటీవల అరెస్ట్ అయిన పేరు మోసిన రౌడీ బుల్లెట్ నాగరాజు గురించి పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తేని జిల్లా పెరియకుళం ప్రాంతానికి చెందిన బుల్లెట్ నాగరాజుపై రాష్ట్ర వ్యాప్తంగా హత్య, దోపిడీ కేసులున్నాయి. 

అందినకాడికి దోచుకుంటూ నాగరాజన్ విలాసవంతమైన జీవితం గడిపినట్లుగా తెలుస్తోంది. ఆరుగురిని పెళ్లి చేసుకుని దోపిడి సొమ్ముతో జల్సాగా తిరిగేవాడు... వీరిలో ఒక సినీ నటి కూడా ఉంది... అంతేకాకుండా పలువురు మహిళలను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవల మధురై జైళ్ల శాఖ మహిళా ఎస్పీ ఊర్మిళ, పెరియకుళం తెన్‌కరై మహిళా సీఐకి ఫోన్ చేసిన నాగరాజన్ బెదిరించాడు. అక్కడితో ఆగకుండా తేని జిల్లా కలెక్టర్, ఎస్పీలను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆడియో టేపులను సైతం బయటకు వదిలాడు. తనను పోలీసులు పట్టుకోలేరంటూ సవాల్ విసిరాడు.

దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం నాగరాజన్‌ను వేలూరు జైలుకు తరలించారు. ఆ సమయంలో అతను ఖైదీ దుస్తులు వేసుకోవడానికి అంగీకరించకపోగా... పోలీసులతో గొడవ పడ్డాడు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST