20 శాతం క‌న్నా ఎక్కువ కేసులు న‌మోదైతే బిల్డింగ్ మూసివేత‌ - ముంబైలో కొత్త క‌రోనా ఆంక్ష‌లు

Published : Jan 04, 2022, 03:36 PM IST
20 శాతం క‌న్నా ఎక్కువ కేసులు న‌మోదైతే బిల్డింగ్ మూసివేత‌ - ముంబైలో కొత్త క‌రోనా ఆంక్ష‌లు

సారాంశం

కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ముంబై లో కరోనా ఆంక్షలు కఠినతరం చేశారు. ఈ మేరకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం 20 శాతం కంటే ఎక్కువగా కేసులు నమోదైతే అపార్ట్ మెంట్ ను మూసివేస్తారు. వారికి ఆహారం, మెడిసిన్, ఇతర నిత్యవసరాలు వారికి అందేలా చర్యలు తీసుకుంటారు. 

దేశంలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసుల‌తో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ డెల్టా తో పోలిస్తే చాలా వేగంగా వ్యాపిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 38 దేశాల‌కు విస్త‌రించింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. మ‌న దేశంలోనూ ఈ వేరియంట్ కేసులు పెరుతున్నాయి. గ‌త నెల 2వ తేదీన ఈ వేరియంట్ కేసుల‌ను క‌ర్నాట‌క‌లో మొట్ట మొద‌టి సారిగా గుర్తించారు. దాదాపు నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ కేసులు 1500 దాటాయి.

71 ఏళ్ల వయసులో జిమ్‌లో ప్రధాని మోడీ వర్కౌట్లు.. వీడియో వైరల్

కోవిడ్ -19 డెల్టా, ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండ‌టంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయ్యాయి. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి క‌ఠిన ఆంక్ష‌లు  విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్నాట‌క‌, ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు చేశాయి. ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  క‌రోనా కేసుల్లో ఢిల్లీ, మ‌హారాష్ట్ర రాష్ట్రాలు మొద‌టి, రెండో స్థానాల్లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలోని ముంబైలోనే అత్య‌ధిక ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌ఠిన ఆంక్ష‌లు అమలు చేస్తోంది. 

ముంబై ప‌ట్ణణంలో కేసుల పెరుగుతుండ‌టంతో మ‌రిన్ని ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అందులో భాగంగా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం 20 శాతం కంటే అధికంగా కేసులు న‌మోదైతే ఆ బిల్డింగ్, అపార్ట్ మెంట్ ను మూసి వేస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అయితే మొద‌టి వేవ్ స‌మ‌యంలో ఒక కేసు న‌మోదైనా ఆ బిల్డింగ్ ను ప్ర‌భుత్వం మూసివేసింది. దీనిపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో త‌రువాత ఆ నిర్ణ‌యాన్ని స‌వ‌రించింది. అయితే మూసివేసిన అపార్ట్‌మెంట్స్ లలో నివ‌సించే కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన ఆహారం, మెడిసిన్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందేలా చూసుకోవాల‌ని బిల్డింగ్ మేనేజింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. 

పాట్నా మెడిక‌ల్ కాలేజీలో 159 మంది వైద్యుల‌కు క‌రోనా

ఈ విష‌యంలో ముంబై మేయ‌ర్ కిషోరి పెడ్నేకర్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోజుకు 20 వేల కోవిడ్ -19 కేసులు నమోదైతే లాక్ డౌన్ విధించాల‌నే విష‌యాన్ని ఆలోచిస్తామని తెలిపారు. థియేటర్లు, పార్క్ లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ర‌ద్దీ కొన‌సాగితే మాత్రం మినీ లాక్ డౌన్ విధిస్తామ‌ని చెప్పారు. పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల విష‌యంలో రెండు, మూడు రోజుల త‌రువాత సీఎం మాట్లాడుతార‌ని తెలిపారు. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌హారాష్ట్రలో 12,160 కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోద‌య్యాయ‌ని, క‌రోనాతో 11 మంది మృతి చెందార‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకే రోజుల్లో 10 వేల కంటే ఎక్కువ‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ముంబై కార్పొరేష‌న్ ప‌రిధిలో ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేశారు. ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా మాస్క్‌లు ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?