బడ్జెట్ లో వరాలు.. మండిపడుతున్న కాంగ్రెస్

By ramya neerukondaFirst Published Feb 1, 2019, 12:56 PM IST
Highlights

ఐదేళ్లపాటు రైతులను పస్తులు పెట్టి.. ఇప్పుడు పల్లీలు చల్లుతున్నారా అని కాంగ్రెస్ మండిపడింది.
 


కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో రైతులకు, సామాన్యులకు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఐదేళ్లపాటు రైతులను పస్తులు పెట్టి.. ఇప్పుడు పల్లీలు చల్లుతున్నారా అని కాంగ్రెస్ మండిపడింది.

కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా.. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝూ స్పందించారు.

‘‘ఐదేళ్లపాటు రైతులకు నరకయాతనకు గురిచేసి.. ఇప్పుడు కంటితుడువుగా రూ.75వేల కోట్లు రైతులకు కేటాయించారు. ఇవి పల్లీలకు కూడా సరిపోవు..’’ అని విమర్శించారు. రైతులు, పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన రీతిలో ప్రయోజనాలు కల్పిస్తుందని ఆయన అన్నారు.

కాగా వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని తాజా బడ్జెట్ ప్రసంగంలో పియూష్ గోయల్ ప్రకటించారు. మొత్తం 12 కోట్ల మంది రైతులకు దీనిద్వారా ప్రయోజం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకర్షించడానికే ఈ బడ్జెట్ ఇలా ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

click me!