ఆదాయపన్ను పన్ను పరిమితి పెంపు: ఉద్యోగులకు భారీ ఊరట

By narsimha lodeFirst Published Feb 1, 2019, 12:13 PM IST
Highlights

ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రెండున్నర లక్షలుగా ఉంది.
 

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రెండున్నర లక్షలుగా ఉంది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  శుక్రవారం నాడు బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించారు.  ప్రస్తుతం ఏటా ఆదాయ పన్ను పరిమితి రెండున్నర లక్షల నుండి  రూ.5లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

ఆదాయపు పన్ను శాఖలో సంస్కరణలు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ట్యాక్స్ చెల్లింపు దారులకు   అదే రోజున  రీఫండ్ డబ్బులను అదే రోజున తిరిగి చెల్లించనున్నట్టు మంత్రి ప్రకటించారు.

ట్యాక్స్ చెల్లింపు దారులను కేంద్ర మంత్రి అభినందించారు. మధ్య తరగతి  ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రి  వరాలు కురిపించారు.ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచడం వల్ల పెన్షనర్లు,  మధ్య తరగతి ఉద్యోగులకు భారీగా ఊరట లభించనుంది.

దేశ వ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది ప్రజలకు ఆదాయపన్ను పరిమితి వల్ల  లబ్ది చేకూరనుంది.బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లపై రూ. 50 వేల వరకు వడ్డీకి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది.పిల్లల విద్య, తల్లిదండ్రుల వైద్యం ఖర్చులకు పన్నును మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 

బ్యాంకులు, పోస్టాపీసు డిపాజిట్లపై రూ. 50 వేల వరకూ వడ్డీకి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.రూ. 6.5 లక్షల ఆదాయం గల వాళ్లు పీఎఫ్‌లో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.ఇంటి అద్దెలపై టీడీఎస్ 1.40 లక్షల నుండి రూ.2.40 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.టీడీఎస్‌ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాదికి ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ.ఐదు నుండి 10 లక్షలు  ఆదాయం ఉన్న వారు 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారంతా  30 శాతం పన్నును చెల్లించాలి. 20 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు కూడ 30 శాతం పన్నును చెల్లించాల్సిందే. 

 

ఉద్యోగులకు కొత్త పథకం

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.  ఈఎస్ఐ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో రూ.15వేలలోపు జీతం పొందే వారికి ఈఎస్ఐ వర్తించేంది. కాగా.. దీనిని తాజాగా రూ.21వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

రూ.15వేల నెల జీతం ఉండే ఉద్యోగులకు కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కూడా చెప్పారు. కొత్త పెన్షన్ పథకం పేరు ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మానథన్ గా  ప్రకటించారు. ఈ పథకానికి రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

అసంఘటిత కార్మికులకు గోయల్ వరం: గ్రాట్యూటీ పరిమితి పెంపు

60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు ప్రతి నెల రూ. 3 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్టు  కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

అసంఘటిత కార్మికులు ప్రతి నెల రూ.100 చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.3 వేల చొప్పున పెన్షన్  అందించనున్నట్టు చెప్పారు.  అసంఘటిత  రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది.

 మరోవైపు గ్రాట్యూటీ పరిమితిని 30 లక్షలకు పెంచింది.  ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10 లక్షలు మాత్రమే ఉంది. దీన్ని రూ30 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.  కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరించనున్నట్టు పీయూష్ ప్రకటించారు.  పెన్షన్‌లో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచనున్నారు.  కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలను  అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఈపీఎప్ఓ సభ్యుల సంఖ్య రెండేళ్లలో రెండు కోట్లకు పెరిగినట్టు కేంద్రం ప్రకటించింది. కార్మికుల ప్రమాద భీమాను రూ.1.50 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

click me!