రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. యూసీసీ స‌హా ప‌లు కీల‌క బిల్లులు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం..

Published : Jul 19, 2023, 12:31 PM IST
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. యూసీసీ స‌హా ప‌లు కీల‌క బిల్లులు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం..

సారాంశం

New Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి (జూలై 20) నుంచి ప్రారంభం కానున్నాయి. యూసీసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం వుండ‌గా,  ప్ర‌తిప‌క్షాలు మణిపూర్ సంక్షోభం అంశాన్ని తెరలేపే అవకాశముంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం, ఢిల్లీలోని అశోకా హోటల్లో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) స‌మావేశాలు జరిగిన త‌ర్వాత జ‌రుగుతున్న ఈ పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగే అవ‌కాశ‌ముంది.

Parliament Monsoon session 2023: పార్లమెంట్ 2023 వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి (జూలై 20) నుంచి ప్రారంభం కానున్నాయి. యూసీసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం వుండ‌గా,  ప్ర‌తిప‌క్షాలు మణిపూర్ సంక్షోభం అంశాన్ని తెరలేపే అవకాశముంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం, ఢిల్లీలోని అశోకా హోటల్లో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) స‌మావేశాలు జరిగిన త‌ర్వాత జ‌రుగుతున్న ఈ పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగే అవ‌కాశ‌ముంది.

వివ‌రాల్లోకెళ్తే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 17 వరకు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 17 సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో 37 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయనీ, వీటిలో 21 బిల్లులు ఈ సమావేశాల్లో పరిశీలనకు, ఆమోదం కోసం పార్ల‌మెంట్ లో ప్ర‌వేశపెట్టడానికి, పరిశీలనకు, ఆమోదం కోసం జాబితా చేయబడ్డాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం, ఢిల్లీలోని అశోకా హోటల్లో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల తర్వాత రాబోయే పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు వ్యూహాలు రచించడం, షెడ్యూల్ ను రూపొందించడం లక్ష్యంగా ఈ రెండు సమావేశాలు జరిగాయి.

2023 పార్ల‌మెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానుండగా, యూసీసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం వుండ‌గా, ప్ర‌తిప‌క్షాలు మణిపూర్ సంక్షోభానికి తెరలేపే అవకాశం కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే వర్షాకాల సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధ‌వారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశాల నేప‌థ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన మంత్రివర్గ సహచరులైన ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో విడివిడిగా సమావేశమయ్యారు. వివాదాస్పద యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు సంబంధించిన బిల్లును వచ్చే సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపవచ్చు, అలాగే, యూసీసీ పై సంబంధిత వ‌ర్గాల నుంచి అభిప్రాయాలను వినే అవ‌కాశ‌ముంది.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, భారతదేశంలోని అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ డేటా దాని లీగల్ డొమైన్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి సమ్మతిని అనుసరించి మాత్రమే వ్యక్తిగత డేటా ప్రాసెస్ చేయబడుతుంది. పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే, వ్యక్తులు తమ డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ గురించి వివరాలను కోరే హక్కును కల్పిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో దేశవ్యాప్త జనాభా లెక్కలపై కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని ఈ ఏడాది మేలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అమిత్ షా ప్రకారం, అభివృద్ధికి ప్రాథమిక ప్రణాళికను రూపొందించడానికి, అణగారిన, దోపిడీకి గురైన వారికి మౌళిక సదుపాయాలను అందించడానికి కొత్త జనాభా గణన సహాయపడుతుంది. ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు గుర్తింపు కార్డు పొందడానికి వీలు కల్పించే నిబంధన ఈ బిల్లులో ఉంటుందని కేంద్ర హోం మంత్రి తెలిపారు.

మణిపూర్ సంక్షోభం, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అదానీ-హిండెన్ బ‌ర్గ్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు డిమాండ్, ఏజెన్సీల దుర్వినియోగం, జీఎస్టీని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదం దృష్ట్యా రైల్వే భద్రత అంశాన్ని కూడా లేవనెత్తుతామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించే క్రమంలో రైల్వే భద్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాన్ని పక్కన పెట్టారని రమేశ్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?